Pawan kalyan: ఈ ఏడాది PK రాడు..ఫిక్స్ అయిపోండి?

Pawan Kalyan will not come this year.

టాలీవుడ్ లో అందరి కంటే ఎక్కువ సినిమాలు చేస్తున్న స్టార్ హీరో ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే అందరు అంటారు. మొన్నటి వరకు ఓకేసారి నాలుగు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక్క సినిమా షూట్ లో కూడా పాల్గొనడం లేదు. ఎలక్షన్స్ టైం దగ్గర పడుతుండడంతో పూర్తిగా వారాహి యాత్రలోనే నిమగ్నమయ్యాడు పవర్ స్టార్. ఇక ఆ నాలుగు సినిమాల్లో ఆయన స్పెషల్ రోల్ చేసిన “బ్రో” రీసెంట్ గా రిలీజ్ అయి యావరేజ్ గా ఆడింది. ఇక ఉన్నది మూడు సినిమాలు.

అందులో ఒకటి హరీష్ శంకర్ తో చేస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ సినిమా టీజర్ విడుదలై ఆకట్టుకోగా, షూటింగ్ మాత్రం ఇప్పటివరకు 40 శాతం కూడా పూర్తి కాలేదు. ఈ ఇయర్ సినిమా రిలీజ్ కావాలంటే పవన్ పూర్తిగా ఈ సినిమాకే టైం ఇవ్వాల్సి ఉంటుంది. అది కుదరని పని కాబట్టి దీన్ని పక్కన పెట్టేయొచ్చు.

ఇక సుజీత్ తో చేస్తున్న ఓజి పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 2న ఈ సినిమా నుండి టీజర్ కూడా వస్తుంది. అయితే షూటింగ్ మాత్రం సగం కూడా కంప్లీట్ కాలేదు. ఈ సినిమా అయినా రిలీజ్ కావాలంటే పవన్ కళ్యాణ్ కనీసం 3నెలలైనా డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది కూడా బిస్కెటే.

- Advertisement -

ఇక మిగిలింది క్రిష్ దర్శకత్వం వహిస్తున్న “హరిహర వీరమల్లు”. ఎప్పుడో మూడేళ్ళ కిందట మొదలైన ఈ షూటింగ్ ఇప్పటికి జరుగుతూనే ఉంది. 60శాతం పూర్తవగా మిగతా భాగం ఫినిష్ చేయాలన్నా పవన్ కళ్యాణ్ ఈ ఇయర్ మూడు నాలుగు నెలలు టైం కేటాయించాలి. పైగా మిగతా వాటికన్నా ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే ఈ సినిమా పీరియాడిక్ డ్రామా కాబట్టి.

ఈ మూడు సినిమాల్లో ఏ ఒక్కటి రిలీజ్ కావాలన్నా పవన్ కళ్యాణ్ మూడు నాలుగు నెలలు ఆ మూవీకే టైం కేటాయించాలి. ఎలక్షన్స్ టైం లో అది మ్యానేజ్ చేయడం కష్టం. అందుకే ఈ ఇయర్ పవర్ స్టార్ సినిమా రాదనీ అభిమానులు ఫిక్స్ అయిపోతే మంచిదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఒకవేళ వస్తే పవన్ ఫ్యాన్స్ లక్కీయే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు