Allu Arjun’s Pushpa The Rule : పుష్ప రాజ్ ఖాతాలో మరో సంచలనం

Allu Arjun’s Pushpa The Rule

ఇండియాస్ మోస్ట్ యాన్టిస్పెటెడ్ సినిమా పుష్ప ది రూల్ మరో సంచలన రికార్డ్ ను సొంతం చేసుకుంది. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ పాన్ ఇండియన్ సినిమా గురించి ఇండియా మొత్తం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారనే విషయానికి పుష్ప సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డ్ లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

మైత్రి మూవీస్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఇంస్టాగ్రామ్ లో 7 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇంతవరకు రిలీజైన ఏ ఇండియన్ సినిమా పోస్టర్ కు పుష్ప 2 పోస్టర్ కు వచ్చినన్ని లైక్స్ రాలేదు. దాంతో 7 మిలియన్ లైక్స్ మార్క్ ను టచ్ చేసిన మొదటి ఇండియన్ సినిమాగా పుష్ప సినిమా సరికొత్త రికార్డ్ చేసింది.

అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెలలో రిలీజ్ అవబోతున్నట్టు సమాచారం అందుతోంది. పుష్ప సినిమా పై ఉన్న అంచనాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఎంత ఆలస్యమైన సినిమా బెస్ట్ అవుట్ ఫుట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి డైరెక్టర్ సుకుమార్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు 40శాతం షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు