Chiranjeevi: భోళా శంకర్ 2డేస్ కలెక్షన్స్.. దారుణమైన దెబ్బ

Bhola Shankar 2 days collections.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ ఆగష్టు11 న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ముందు నుండే అంచనాలు లేకపోగా, ట్రైలర్ రిలీజ్ తర్వాత పాక్షికంగా కొంచెం హైప్ తో రిలీజ్ అయింది. అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే భోళా శంకర్ తోలి షో న్యూడ్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా రీమేక్ సినిమా కావడం, అందులోనూ ప్లాప్ లకి కేర్ ఆఫ్ అయిన మెహర్ రమేష్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం భోళా శంకర్ ఫలితాన్ని దెబ్బతీశాయి.

ఇక ఫస్ట్ డే నే మెగాస్టార్ కెరీర్ లో రీ ఎంట్రీ తరువాత లోయెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 18కోట్ల షేర్ ని మాత్రమే వసూలు చేయగా 28కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే వీకెండ్ కాబట్టి మరో రెండు రోజులు వసూళ్లొస్తాయని అందరూ అనుకున్నారు. కానీ రెండో రోజు దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది భోళా. రెండో రోజు భోళా శంకర్ తెలుగు రాష్ట్రాల్లో కేవలం 3.12 కోట్ల షేర్ నే వసూలు చేసింది. ఇది గత ఆరేళ్లలో స్టార్ హీరోల సినిమాల్లో లోయెస్ట్ రికార్డు.

ఈ రికార్డు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి పేరిట ఉండేది. ఆ సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.75కోట్లు రాబట్టింది. దాన్ని భోళా బ్రేక్ చేసింది. ఇక భోళా శంకర్ వరల్డ్ వైడ్ గా రెండ్రోజుల్లో 21.98 కోట్ల షేర్ అలాగే 34 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 58కోట్లయినా కావాలి. అది జరగదని తెలిసిపోయింది. కానీ ఎంతవరకు నష్టాల్ని తగ్గిస్తుదనేదే ఆసక్తిగా మారింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం భోళా శంకర్ 30కోట్ల మార్క్ దాటినా గొప్పే అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు