BABY : ఓటిటిలోకి వచ్చేస్తున్న.. బేబీ

BABY

వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన బేబీ సినిమా ఇటీవలనే రిలీజై, ఎంత పెద్ద హిట్టైందో అందరికి తెలిసిందే. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ.. మీడియం రేంజ్ సినిమాలో సంచలన విజయం సాధించింది.

మాస్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎస్ కె ఎన్ నిర్మించిన ఈ బేబి సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేయగా.. మంచి అంచనాల మధ్య జులై 14న ఈ సినిమా రిలీజయింది. రిలీజైన మొదటి వారంలోనే 50 కోట్ల కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 90 కోట్ల కలెక్షన్స్ తో మీడియం రేంజ్ సినిమాలలో సరికొత్త రికార్డ్ ను సృష్టించింది. అలాగే చిరంజీవి అల్లు అర్జున్, సుకుమార్ లాంటి ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంషలు అందుకుంది.

అయితే ఎంత భారీ విజయం అందుకున్న ఈ సినిమా త్వరలోనే ఓటిటిలోకి కూడా రాబోతునట్టు కాసేపటి క్రితమే ఎనౌన్స్ మెంట్ వచ్చింది. తెలుగు ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన ఆహా లో ఈ సినిమా ఆగస్ట్ 25 నుంచి స్ట్రీమ్ అవడానికి రెడీ అయింది. ఆహా గోల్డ్ సుబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్ళకి ఈ సినిమా రిలీజ్ కు 12 గంటల ముందుగానే బేబీ స్ట్రీమ్ అవనున్నట్టు ఆహా ప్రకటించింది. మరీ థియేటర్స్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్న బేబీ, ఓటిటిలో ఎలాంటి ఆదరణ పొందనుందో వేచి చూడాలి.

- Advertisement -

 

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు