Regina Cassandra latest interview : ఆ పని చేస్తేనే.. సినిమాల అవకాశాలు ఇస్తామన్నారు

Regina Cassandra latest interview

రెజీనా కసాండ్రా… గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది ఈ బ్యూటీ. 2005లో తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార రెజీనా. 2012లో వచ్చిన ‘శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది.

పలువురు అగ్ర హీరోల తరపున నటించిన ఈ బ్యూటీ ఆనతికాలంలోనే మంచి నటిగా పేరు సంపాదించుకుంది. తనదైన అందం, నటనతో అభిమానులను మెస్మరైజ్ చేసిన రెజీనా కసాండ్రా ఖాతాల్లో మంచి విజయాలను వేసుకుంది. ఇక తాజాగా ఆచార్య మూవీలో ఐటెం సాంగ్ తో మెప్పించింది.

తాజాగా… ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా కాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “నా సినీ కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం కొందరిని సంప్రదించాను. దాంతో ఓ వ్యక్తి నాకు ఫోన్ చేసి ఛాన్స్ ఇస్తానని అడ్జస్ట్మెంట్ కి ఓకే చెబితే తర్వాత వెంటనే షూటింగ్ పని చేసుకోవచ్చన్నారు. ఇది జరిగి ఇప్పటికి సుమారు 10 సంవత్సరాలు అయింది.

- Advertisement -

నా వయసు అప్పుడు కేవలం 20 ఏళ్లు. అతని మాటల పట్ల నాకు సరైన అవగాహన లేదు. అడ్జస్ట్మెంట్ అంటే ఏంటో కూడా తెలియదు. రెమ్యూనరేషన్ విషయంలో అడుగుతున్నారేమోనని సరే నా మేనేజర్ నీతో మాట్లాడతారని ఫోన్ కట్ చేశాను. ఆ తర్వాత మేనేజర్ ద్వారా అసలు విషయం తెలిసింది” అంటూ చెప్పుకొచ్చింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు