Rithu chowdary : అక్కినేని నాగచైతన్య తో జబర్దస్త్ నటి వివాహాం?

rithu chowdary comments on naga chaithanya

జబర్దస్త్ నటి రీతు చౌదరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకప్పుడు ఫేస్బుక్ హవా ఏ లెవెల్ లో నడిచిందో అందరికీ తెలిసిందే. కానీ ఇన్ స్టాగ్రామ్ వచ్చిన తర్వాత మొత్తం అందరూ దీని మీదే పడ్డారు. ఇక సెలబ్రిటీలు, వాళ్ళ సినిమా అప్డేట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ అన్ని ఇన్ స్టాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇక బుల్లితెర సెలబ్రిటీల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ఇన్ స్టా ఫాలోవర్లను పెంచుకోవడానికి హద్దులు మీరుతూ అందాల ఆరబోత చేస్తున్నారు.

అలా ఈ మధ్యకాలంలో రీతూ చౌదరి హాట్ వీడియోలు, గ్లామరస్ ఫోటోలతో ఇన్స్టాగ్రామ్ ను హీటెక్కిస్తోంది. మొదట్లో సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి.. పాపులర్ అయిన రీతు చౌదరి జబర్దస్త్ షో తో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయింది. అయితే తాజాగా మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది. అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చింది. అయితే ఓ నెటిజన్ నాగచైతన్యను పెళ్లి చేసుకో… ఆయన కూడా విడాకులు తీసుకునే ఉన్నాడు కదా అన్నాడు.

సెల్ఫీ వీడియో ద్వారా ఆ అదృష్టం ఉంటే వెంటనే చేసుకుంటాను అని ఏమాత్రం మొహమాటం పడకుండా చెప్పేసింది రీతు చౌదరి. ఇప్పుడు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ బాగా వైరల్ అవుతుంది.
కాగా అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత 2021 డిసెంబర్ మాసంలో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని అనివార్య కారణాలవల్ల అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి జీవితం వారిదే అన్నట్లుగా విడివిడిగా తమ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు