Venu swamy sensational comments : ఆ సెలబ్రిటీ జంట కూడా విడిపోతుంది

Venu swamy sensational comments

గత కొంతకాలం నుండి సినీ సెలెబ్రెటీల జాతకాలను చెబుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అక్కినేని నాగచైతన్య – సమంత పెళ్లి చేసుకునే సమయంలో వారిద్దరూ విడిపోతారని జోష్యం చెప్పారు వేణు స్వామి. ఆయన చెప్పినట్లే జరగడంతో అందరికీ అతని జ్యోతిష్యంపై నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన సెలబ్రిటీల గురించి చెప్పిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.

ఇక పవన్ కళ్యాణ్ కి కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బందులు తప్పవని కూడా అన్నారు వేణు స్వామి. అనుష్క శెట్టి, రష్మిక వివాహాలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నయనతార వైవాహిక జీవితం గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె వైవాహిక జీవితం సాఫీగా సాగదన్నారు. రామ్ చరణ్ – ఉపాసన జంట ఆలస్యంగా తల్లిదండ్రులవుతారని గతంలోనే చెప్పారు. ఇక నిధి అగర్వాల్, శ్రీలీల, డింపుల్ హయాతి వంటి హీరోయిన్లు ఆయన చెప్పినట్లు యాగాలు, పూజలు కూడా చేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో స్టార్ కపుల్ ఆది పినిశెట్టి – నిక్కీ గల్రాని భవిష్యత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత – నాగచైతన్యలాగే ఆది పినిశెట్టి – నిక్కి విడిపోతారని సంచలన కామెంట్ చేశారు వేణు స్వామి. ఈ జంట జాతకం క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే ఇద్దరు కలిసి ఉండడం అసాధారణమని అన్నారు. 80% వీరు విడాకులు తీసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ జంట భవిష్యత్తు గురించి తనకు చాలా అవగాహన ఉందని.. అందుకే చెప్పాల్సి వచ్చిందన్నారు. అంతేకానీ వారు విడిపోవాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. ముందు ముందు వచ్చే సమస్యలను దూరం చేసుకోగలిగితే సమస్యలకు పరిష్కారం లభించినట్లేనని తెలిపారు. దీంతో వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు