“భయపడ్డాం”… లావణ్యతో రిలేషన్‌షిప్‌పై వరుణ్ తేజ్

Varun Tej and Lavanya Tripathi

సినిమా ఇండస్ట్రీలో గాసిప్ రాయుళ్లు ఎప్పుడు ఏం జరుగుతుందా? ఎక్కడా ఏం దొరుకుతుందా? అని కళ్లు కాయలు కాచేలు కాచుకుని కూర్చుంటారు. ఏ చిన్న మ్యాటర్ వారి కంట పడినా, పెంట పెంట చేస్తారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ లవ్ ఎఫైర్స్ విషయంలో గాసిప్ రాయుళ్ల ఇంట్రెస్ట్ ఎవరెస్ట్ కంటె ఎక్కువ ఎత్తులో ఉంటది. తాము స్ప్రెడ్ చేస్తున్న దాంట్లో ఎంత వరకు నిజముందో అని మినిమం ఆలోచించరు వాళ్లు. హీరో, హీరోయిన్స్ కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతాయో కూడా ఆలోచించరు. ఇదే భయం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఉండేదట.

అందుకే లావణ్య త్రిపాఠితో 7 ఏళ్ల పాటు రిలేషన్‌షిప్ ను సిక్రెట్ గా మెంటైన్ చేశాడట. ఈ విషయాన్ని వరుణ్ రీసెంట్ ఇంటర్వ్వూలో చెప్పాడు. తమక బయటకెళ్లాలని, డిన్నర్స్ చేయాలని ఉండేదని, కానీ, బయటకి తెలిస్తే జరిగే దాన్ని ముందే గ్రహించి అన్నింటినీ త్యాగం చేశామని వరుణ్ చెప్పాడు. తమ రిలేషన్‌షిప్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగితే అది తమ బంధంలో ఎక్కడైనా ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందేమో అని భయం. అందుకే సీక్రెట్ గా ఉంచామంటూ చెప్పుకొచ్చాడు.

కాగా వరుణ్-లావణ్యల ఎంగేజ్‌మెంట్ జూన్ 9న జరిగింది. ఆగస్ట్ 24న పెళ్లి జరుగుతుందని టాక్ వచ్చింది. కానీ, ప్రస్తుతం మెగా కంపౌండ్‌లో పెళ్లి హడావిడి లేకపోవడంతో వీరి పెళ్లి ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అయిందని అర్థమవుతుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు