Honey Rose : హనీ రోజ్ ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది.

Honey Rose

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన హనీ రోజ్ గురించి అందరికి తెలిసిందే. నిజానికి హనీ రోజ్ కు వీరసింహారెడ్డి మొదటి సినిమా కాదు. గతంలోనే రెండు, మూడు తెలుగు సినిమాలలో నటించిన హనీ రోజ్ కు పెద్దగా గుర్తింపు మాత్రం లభించలేదు. దాంతో కన్నడ సినిమాలలోనే ఆమె బిజీ అయింది. చాలా రోజుల గ్యాప్ తరువాత వీరసింహారెడ్డి సినిమాలో కనిపించిన హనీ రోజ్ తన అందం అభినయంతో అందరి మనసును గెలుచుకుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా హనీ రోజ్ జోరుగా పాల్గొని తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై, బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో ఈ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించిన హనీ రోజ్ కు సినిమా అవకాశాలు బాగానే వస్తాయని అంత అనుకున్నారు. కానీ తీరా చూస్తే అలా జరగలేదనే చెప్పాలి.

కేవలం షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ఫంక్షన్స్ లకు మాత్రమే హనీ రోజ్ పరిమితమైంది. వీరసింహారెడ్డి సినిమాలో అధిక ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన కూడా హాని రోజ్ కు సినిమాలు అవకాశాలు రాకపోవడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. అయితే దీనికి కారణం లేకపోలేదు. నిజానికి హనీ రోజ్ కు సినిమాలు రాకపోవడానికి రీజన్ ఆమె స్వయంగా చేసిన ఒక తప్పు అనే చెప్పాలి.

- Advertisement -

ఆ తప్పు వల్లే హనీ రోజ్ తెలుగులో అవకాశాలు అందుకోలేకపోతుంది. అదేంటంటే బాలకృష్ణ లాంటి ఏజ్ బార్ హీరోకు జోడిగా నటించడం కేవలం మూడు పదుల వయసులోనే బాలకృష్ణ లాంటి హీరో పక్కన ఆమె జోడిగా మరియు అలాగే పెద్ద వయస్కు రాలిగా నటించడం వల్ల ఆమెకు సినిమాలు రావట్లేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. వీరసింహారెడ్డి సినిమా తరువాత ఇప్పటి వరకు తెలుగులో ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వని హనీ రోజ్ రాహేలు అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమాతోనైన హనీ రోజ్ జాతకం మారుతుందో లేదో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు