Honey Rose: హనీరోజ్ బ్రాండ్ ప్ర‌మోష‌న్ కు ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందో తెలుసా..?

మలయాళ బ్యూటీ హనీరోజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది మలయాళ బ్యూటీ హనీరోజ్. నిజానికి చాలా ఏళ్ల క్రిందే హనీరోజ్ తెలుగులో సినిమాలు చేసింది. కానీ, అప్పుడు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, ఇటీవల నందమూరి నటసింహం బాలయ్య నటించిన వీర సింహా రెడ్డిలో సెకండ్ హీరోయిన్ గా చేసింది.

ఒక వైపు బాలయ్యతో రొమాన్స్ చేస్తూనే, మరో బాలయ్య పాత్రకు అమ్మ పాత్ర చేసింది. మా బావ మనోభావాలు దెబ్బతిన్నయి తో పాటు సినిమాలో బాలయ్యకు, హానీ రోజ్ కి మధ్య వచ్చిన సన్నివేశాలతో హనీ రోజ్ సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది.

ఇక ఈ సినిమా తరువాత హనీరోజ్ క్రేజ్‌ భారీగా పెరిగి పోయింది. నిజానికి హానీ రోజ్ మలయాళ బ్యూటీ. అక్కడ మోహన్ లాల్‌ తో ఓ సినిమాలో నటించి.. సూపర్‌ హిట్‌ అందుకుంది. ఆ తర్వాత అక్కడ హనీరోజ్‌ క్రేజ్‌ పెరిగింది. ఇక తాజాగా బాలయ్య వీర సింహారెడ్డి సినిమాతో టాలీవుడ్‌ లో క్రేజ్‌ తెచ్చుకుంది.

దీంతో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి ఈ బ్యూటీకి. ఆఫర్లు రావడమే కాదు ప్రమోషన్స్‌ తోనూ బిజీగా ఉంది ఈ హాట్‌ బ్యూటీ. షాప్‌ ఓపెనింగ్స్‌ మరియు సోషల్‌ మీడియా ప్రమోషన్స్‌ తో డబ్బులు బాగానే పోగేసుకుంటోంది. ఇక ఇటీవల హైదరాబాద్ లోను మలయాళ బ్యూటీ హనీరోజ్ ఓ హోటల్ ప్రారంభంలో పాల్గొంది. ఇక ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న హానీ రోజ్ ఎంత సంపాదిస్తుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.

- Advertisement -

అయితే సోషల్ మీడియా టాక్ ప్రకారం ఈ హాట్ బ్యూటీ ఒక్కో షాపు ఓపెనింగ్ కు దాదాపు 8 లక్షలు తీసుకుంటుందని సమాచారం. హనీరోజ్‌ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎక్కువగా రావడంతో ఆ రేంజ్ లో పుచ్చుకుంటుందట.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు