Shruti Hasan: అప్పట్లో ఓ ప్రొడ్యూసర్ తో శృతి వివాదం గుర్తుందా..?

శృతి హాసన్, కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత బహుముఖ ప్రజ్ఞ కనపరుస్తూ ఇటు యాక్టింగ్ చేస్తూనే అప్పుడప్పుడు సింగింగ్, మ్యూజిక్ డైరెక్షన్లో కూడా తన ప్రతిభ కనపరుస్తూ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ తమిళ భామ అనతి కాలంలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ప్రారంభించిన కొద్దీ కాలానికే దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి తానేంటో ప్రూవ్ చేసుకుంది శృతి హాసన్.

అప్పట్లో రవితేజతో బలుపు సినిమా చేసే సమయంలో నిర్మాత పీవీపీకి శృతి హాసన్ కు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, పీవీపీ వ్యవహార శైలి నచ్చక శృతి సినిమా నుండి వైదొలిగేంత వరకూ వచ్చిందంట వ్యవహారం. అయితే అగ్రిమెంట్లో ఉన్న పాయింట్స్ చూపుతూ నిర్మాత పీవీపీ కోర్ట్ మెట్లు ఎక్కటంతో  శృతి దిగొచ్చి సినిమా పూర్తి చేసిందని అప్పటి కధనాల సారాంశం.
ప్రొడ్యూసర్లకు, హీరోయిన్లకు మధ్య విభేదాలు రావటం తరచూ వింటూనే ఉంటాం. ఆ విభేదాలు ముదిరి సదరు హీరోయిన్లపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ బ్యాన్ విధించిన సందర్భాలు కూడా చూసాం.

అయితే శృతి హాసన్ వివాదం అందుకు భిన్నంగా ఉంది, ఈ ఇష్యూ శృతి హాసన్ వైపు గనక తప్పు ఉండుంటే కౌన్సిల్ ను ఆశ్రయించి తనపై బ్యాన్ విధించేలా చర్యలు తీసుకునే వాడు కానీ పీవీపీ అలా చేయలేదు. దీన్ని బట్టి చుస్తే  సీరియస్ ఇష్యూ ఏదో జరిగినట్టే అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత పీవీపీ తీసిన సినిమాల్లో శృతి ఉండకపోవటం గమనిస్తే ఇద్దరి మధ్య జరిగిన కాంట్రవర్సీ ఇప్పటికి క్లియర్ కాలేదని అనిపిస్తోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు