Honey Rose Surgery: అందం కోసం సర్జరీ చేసుకున్న బాలయ్య హీరోయిన్?

Honey Rose Surgery?

కొంతమంది వందల సినిమాలు చేయనవసరం లేదు. ఒక్క సినిమాతోనే వందల సినిమాలు చేసిన ఇమేజ్ ను సాధిస్తుంటారు. మరి ముఖ్యంగా బ్యూటీతో… ఆడియన్స్ మనసులు దోచేస్తుంటారు. అలాంటి వారిలో హనీ రోజ్ కూడా ఒకరు. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబు సరసన నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ హనీ రోజ్. ఆ తర్వాత వెంటనే హనీ రోజ్ సినిమాలలో బిజీ అయిపోతుందని అందరూ భావిస్తే… అందుకు భిన్నంగా హనీరోజ్ అభిమానులను నిరాశపరిచింది.

సోషల్ మీడియాలో తన క్రేజీ ఫోటోలతో అందరి మతులు పోగొడుతున్న హనీరోజ్ కు వెంటనే సినిమాలలో అవకాశం రాకపోవడం అభిమానులను షాక్ కు గురిచేసింది. ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె ఇటీవల బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.

ఈమెకు ఇన్స్టాగ్రామ్ లో 33 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. తాజాగా ఈ బ్యూటీ తన అందం గురించి జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించింది. హీరోయిన్గా గ్లామర్ రంగంలో అందాన్ని కాపాడుకోవడం అవసరమే కదా అని పేర్కొంది. అందుకోసం సౌందర్య సాధనాలను వాడుతుంటానని తెలిపింది. అయితే కొందరు ప్రచారం చేస్తున్నట్టు శస్త్ర చికిత్స మాత్రం చేయించుకోలేదని స్పష్టం చేసింది. నటిగా కొనసాగడం సాధారణ విషయం కాదని, తన అందం అనేది భగవంతుడి సృష్టేనని హనీ రోజ్ చెప్పుకొచ్చింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు