Laxmi Pranathi: జూనియర్ ఎన్టీఆర్ భార్య పెళ్లి రోజు కట్టుకున్న చీర ధర ఎంతో తెలుసా ?

Laxmi pranathi

జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ ఎన్టీఆర్ చాలా చిన్న ఏజ్ లోని వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. అతి తక్కువ కాలంలోనే మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో ఎన్టీఆర్. టాలీవుడ్ యంగ్ టైగర్ గా దూసుకుపోతున్నారు. నందమూరి హీరోల్లో అత్యధిక ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరో ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్. డైలాగ్స్ పరంగా, యాక్టింగ్ పరంగా, యాంకరింగ్ పరంగా ఎన్టీఆర్ కు ఎవరు సాటిరారు అని చెప్పవచ్చు.

అయితే చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్… ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రానిస్తున్నాడు. ఎన్టీఆర్ లైఫ్ స్టైల్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పెళ్లిలో కట్టుకున్న చీరపై నెట్టింట చర్చ నడుస్తోంది. ఆమె ధరించిన బంగారు వర్ణం గల చీర దాదాపు కోటి రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాకుండా ఎన్టీఆర్ పెళ్లి వేడుకల కోసం దాదాపు 100 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ భార్య లక్ష్మిప్రణతి ధరించిన చీర అంత భారీ ధర పలకడానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పెళ్లిరోజు బంగారు వర్ణంలో ఉన్న చీరను తెలుగు సాంప్రదాయం ఉట్టి పడేలా ధరించింది. లక్ష్మీ ప్రణతి ఖాంజీవరం చీరను స్వచ్ఛమైన బంగారం, వెండితో నేసినట్లుగా సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు