Bigg Boss Season 7: నాగ్ ప్లాన్ అదుర్స్… ఊహించని మార్పులతో బిగ్ బాస్

Bigg Boss Season 7

టెలివిజన్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీవీ షో బిగ్ బాస్. ఎక్కడో హాలీవుడ్ లో స్టార్ట్ అయిన బిగ్ బాస్.. అన్ని భాషల్లోకి విస్తరించింది. తెలుగులోకి కూడా వచ్చిన బిగ్ బాస్, ఇప్పటికే 6 సీజన్లను, ఒక ఓటీటీ సీజన్ ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ తన 7వ సీజన్ కు సిద్ధమవుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 కు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయింది.

అలాగే, ఈ 7వ సీజన్ లో హౌస్ లో కనిపించే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ గాసిప్స్ కూడా వచ్చేస్తున్నాయి. అలా వచ్చే వాళ్లు దాదాపు ఖాయమే అని కూడా తెలుస్తుంది. అయితే ఈ సారి వస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 గతం కంటే కాస్త భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఓటింగ్ విషయంలో చాలా పెద్ద మార్పు చేయబోతున్నట్టు సమాచారం. గతంలో నామినేషన్స్ లో ఉన్న వారికి మద్దతుగా ఓట్లు వేయడానికి సోమవారం నుంచి శుక్రవారం వరకు సమయం ఉండేది. కానీ, దాన్ని మూడు రోజులకే మాత్రమే కుదించారట. వారంలో తొలి రోజులు మాత్రమే ఓట్లు వేసే అవకాశం ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

అలాగే గత సీజన్స్ అన్నీ కూడా ఒక ప్యాట్రన్ ను ఫాలో అవుతూ వచ్చాయి. వీక్ మధ్యలో గేమ్స్, వీకెండ్స్ లో నాగార్జున హోస్టింగ్, ఆదివారం ఎలిమినేషన్స్ ఉండేవి. కానీ బిగ్ బాస్ సీజన్ 7లో మాత్రం ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలియదట. నాగ్ హోస్టింగ్ వీక్ మధ్యలో కూడా రావొచ్చని, వీక్ మధ్యలో కూడా ఎలిమినేషన్స్ ఉంటాయని తెలుస్తుంది. దీంతో పాటు నామినేషన్స్ ప్రక్రియా కూడా గతంలో కంటే భిన్నంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

- Advertisement -

వీటితో పాటు మారో భారీ మార్పు ఏంటంటే..? బిగ్ బాస్ హౌస్ నిర్వాహణ రోజులు. మొదటి సీజన్ టైంలో కేవలం 70 రోజులే ఉండేది. కానీ, తర్వాత దాన్ని 100 రోజులకు పెంచారు. మళ్లీ దీన్ని ఈ సారి తగ్గిస్తున్నట్టు సమాచారం. కేవలం 10 వారాల్లోనే బిగ్ బాస్ సీజన్ 7 ను ముగించాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అంటే 10 వారాల పాటు ఎలిమినేన్స్ జరిగిన తర్వాత 70వ రోజు విన్నర్ ను ప్రకటిస్తారని తెలుస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు