Bro Movie: లక్కీ గర్ల్ కేతిక శర్మ.. కెరీర్‌లో ఫస్ట్ హిట్ కొట్టేసింది

Bro Movie

ఇండస్ట్రీకి కొత్త వాళ్లు చాలా మంది వస్తుంటారు. కానీ నిలబడేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్లు కెరీర్ లో ఎన్ని ఫ్లాపులు పడ్డా.. నిలబడటానికి ఒకే ఒక్క హిట్ చాలు. ఇప్పుడు అలాంటి హిట్ యంగ్ హీరోయిన్ కేతిక శర్మకు పడింది. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై తొలిసారి కనిపించిన కేతిక శర్మకు ఇప్పుడు బ్రో సినిమాతో ఫస్ట్ హిట్ తన ఖాతాలో పడింది.

నిజానికి కేతిక తన ఫస్ట్ మూవీ రొమాంటిక్ లో చాలా బోల్డ్ గా నటించింది. అందాలను ఆరబోయడంలో ఎక్కడా తగ్గలేదు. అలా చేయడం వల్ల ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిలో పడాలి అనుకుంది కాబోలు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో నిరాశే దక్కింది. దీని తర్వాత రొమాంటిక్ చిత్రం వల్లే లక్ష్య, రంగ రంగ వైభవంగా చిత్రాల్లో ఛాన్స్ వచ్చింది, ఈ చిత్రాలు కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాయి.

లక్కీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత నటిస్తున్న బ్రో సినిమాలో కేతిక బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఛాన్స్ వచ్చినప్పుడే ఫస్ట్ హిట్ కొట్టేసింది ఈ బ్యూటీ. పవన్ కళ్యాణ్ చిత్రం అంటే మినిమం గ్యారంటీ. పవర్ స్టార్ మెయిన్ లీడ్ కాకపోయినా, బ్రో చిత్రంలో దాదాపు 80 శాతం ఉన్నాడు. అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు జోడీగా నటించింది. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం యూఎస్ ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

- Advertisement -

వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించాడు అంటూ ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు. అలాగే పవన్ హిట్ సినిమాల్లోనే సూపర్ హిట్ సాంగ్స్ కూడా బ్రో చిత్రంలో ఉండటంతో, ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇలా సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ కనిపించినా, సినిమా అయితే హిట్ టాక్ ను తెచ్చుకుంటుంది. ఇది కేతిక శర్మకి, ఆమె కెరీర్ కు చాలా ప్లస్ అని చెప్పొచ్చు.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు