Matka: మీనాక్షి చౌదరికి మరో లక్కీ ఛాన్స్… ?

Will Meenakshi Chaudhary get more offers?

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి, హీరోయిన్ గా సెటిల్ అయిన వాళ్లు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అందులో మీనాక్షి చౌదరి ఒకరు. 2018లో మిస్ ఇండియా కెరటం గెలుచుకున్న మీనాక్షి.. బాలీవుడ్ లో ఒక్క చిన్న పాత్ర చేసింది. తర్వాత టాలీవుడ్ కి వచ్చి వరుసగా సినిమాలు చేసింది. కానీ, అడివి శేష్ తో నటించిన హిట్ 2 మాత్రం మీనాక్షి చౌదరికి బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చింది. ఈ చిత్రం తర్వాత మీనాక్షికి తెలుగులో భారీగా ఛాన్స్ లు వస్తాయని అనుకున్నారు.

కానీ, పెద్దగా అవకాశాలేం దక్కలేవు. విజయ్ అంటోని నటించిన కోలై మూవీతో కోలీవుడ్ లోకి కూడా ఎంట్రి ఇచ్చింది. కానీ, అది కూడా ఫెయిల్ అయింది. అయినా, అనూహ్యంగా అవకాశాలు వస్తున్నాయి మీనాక్షి. ముందుగా గుంటూరు కారంలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఉండేది. కథ మారడమో, ఇకేదమైనా కారణమో కానీ, పూజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అమె స్థానంలో లక్కీగా మీనాక్షి చౌదరికి ఛాన్స్ వచ్చింది.

అక్కడి నుంచి మీనాక్షి అన్నీ లక్కీ ఛాన్స్ లే వస్తున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల మట్కా అనే చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి అని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. అలాగే విశ్వక్ సేన్ నుంచి తాజాగా రాబోయే సినిమాలో కూడా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఫిక్స్ అయింది. వీటితో పాటు తాజాగా టాలీవుడ్ లో మరో వార్త వినిపిస్తుంది.

- Advertisement -

నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో VNRTrio అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే వీరి కాంబోలో భీష్మ మూవీ వచ్చింది. దీనిలో హీరోయిన్ గా రష్మిక మందన్నా చేసింది. ఈ ముగ్గురు కలిసి మరోసారి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. సినిమా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ, కొన్ని అనివార్యకారణాల వల్ల రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటుందట. దీంతో హీరోయిన్ పాత్ర కోసం మీనాక్షి చౌదరిని చిత్ర యూనిట్ సంప్రదించినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ టాప్ నటిగా నిలవాలని చూస్తున్న మీనాక్షి, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. అందులో భాగంగా ఈ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఇలా మీనాక్షి బిజీ బిజీ అవుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు