Samantha: రికార్డు సెట్ చేసిన ఖుషి ఫస్ట్ సాంగ్

Khushi’s first song set a record

టాలీవుడ్ లో వస్తున్న క్రేజీ సినిమాల్లో ఒకటి “ఖుషి”. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో టాలెంటెడ్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తుంది. మహానటి తర్వాత వీరి కాంబోలో సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమాను నిన్నుకోరి, మజిలీ లాంటి ఫీల్ గుడ్ క్లాసిక్ చిత్రాలను డైరెక్ట్ చేసిన శివ నిర్వాణ తెరకెక్కిస్తుండడంతో “ఖుషి” కూడా ఆ తరహా లో మంచి సినిమా అవుతుందని ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఇక ఖుషి సినిమా నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ నుండే ఈ సినిమాకి అసలైన క్రేజ్ స్టార్ట్ అయింది. “నా రోజా నువ్వే” పేరుతో రిలీజ్ అయిన ఆ పాట ప్రేక్షకుల్లో విశేష ఆధారం పొందింది. ముఖ్యంగా ఆ పాట లిరిక్స్ లో మణిరత్నం సినిమాల పేరును వాడుకొని పాట రాయడం విశేషం. అంతే కాదు ఆ పాట రాసింది స్వయానా ఈ చిత్ర డైరెక్టర్ శివ నిర్వాణ కావడం హైలైట్. తాజాగా ఈ పాట యూట్యూబ్ లో సెన్సషనల్ రికార్డు సెట్ చేసింది. మే9 న రిలీజ్ చేసిన నా రోజా నువ్వే పాట తాజాగా 100 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది.

అయితే ఆ రికార్డు అన్ని వెర్షన్లు కలిపి వచ్చింది. ఒక్క తెలుగులోనే 75 మిల్లియన్ల వ్యూస్ రాగా ఇతర భాషల్లో కలిపి 100 దాటింది. ఇక ఖుషి నుండి రిలీజ్ అయిన రెండో పాట ఆరాధ్య కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకోగా, ఇప్పుడు మూడో సాంగ్ గా టైటిల్ సాంగ్ త్వరలో రిలీజ్ కానుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు