Kushi: సామ్ ఎంజాయ్‌మెంట్ అన్ స్టాపబుల్…

Sam’s enjoyment is unstoppable…

టాలీవుడ్ హీరోయిన్లలో టాలెంటెడ్ హీరోయిన్ గా సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న బ్యూటీ సమంత. చెయ్ తో విడాకుల తర్వాత శాకుంతలంతో ప్లాప్ అందుకున్న సమంత, రిలీఫ్ కోసం సినిమాలకు సిక్స్ మంత్స్ బ్రేక్ తీసుకుంది.

ఇక ఇప్పుడు పూర్తిగా కోలుకున్న సామ్.. ఈ టైమ్ చాలా జాగ్రత్తగా ఎంజాయ్ చేయడానికి యూజ్ చేస్తోంది. మొదటి కొన్ని రోజులు ఈష ఫౌండేషన్ లో ఆధ్యాత్మిక చింతనలో మునిగి తెలిన సామ్.. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ ఎంజాయ్ మూడ్ లోకి వెళ్లిపోయింది. ఎవ్రీ డే.. ఎవ్రీ సెకన్ ని ఎంజాయ్ చేయాలని మోటోగా తీసుకుందో ఏమో.. ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా ఫుల్ స్వింగ్ లో ఉంటుంది.

వాటిని మళ్లీ కెమెరాలో క్యాప్చర్ చేసి, తన ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో షేర్ చేసుకుంటుంది. నిన్నే ఐస్ వాటర్ ఛాలెంజ్ అంటూ 4 డిగ్రిస్ వాటర్ లో 6 మినిట్స్ ఉన్న వీడియోను షేర్ చేసిన సామ్, రీసెంట్ గా మరో వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

- Advertisement -

తన ఫ్రెండ్ అనుష స్వామితో డ్యాన్స్ చేస్తున్న వీడియోను చేసింది. ఈ వీడియో షేర్ చేసిన గంటల్లోనే లక్షల్లో వ్యూస్ రాగా, 5 Lakh కి పైగా లైక్స్ కూడా వచ్చాయి. దీంతో సినిమాలకు దూరంగా ఉంటే ఫ్యాన్స్ కి కూడా దూరమైపోతుంది అని అంటున్న వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం “ఖుషి” మినహా వేరే సినిమా చేయని సామ్, ఆ సినిమా రిలీజ్ తర్వాతే తదుపరి ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు