Kushi movie: సమంత- విజయ్ దేవరకొండ వీడియో కాల్ లీక్

Kushi movie

సమంత- విజయ్ దేవరకొండ సీక్రెట్ మాట్లాడుకున్న వీడియో కాల్ లీక్ అయింది. అర్థరాత్రి ఒంటి గంట అవుతుంది విజయ్ అని సమంత అనిన కూడా విజయ్ వదలకుండా సమంత తో మాట్లాడిన వీడియో కాల్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

సమంత విజయ్ దేవరకొండ కలిసి ఖుషి సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే సెప్టెంబర్ ఒకటిన గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. హేశం అబ్దుల్ వహబ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యి, ఇప్పటి వరకు ఖుషి సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలన్ని పెద్ద హిట్ అయ్యాయి. దాంతో ఖుషి సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ఇక సినిమా రిలీజ్ కు ఏ అడ్డంకులు లేకుండా అంత పాజిటివ్ గా ఉండి, ప్రేక్షకులంతా ఖుషి సినిమా కోసం ఎదురు చూస్తున్న సమయంలో సమంత, విజయ్ దేవరకొండ వీడియో కాల్ లీక్ అయ్యి ఇంటర్నెట్లో సంచలనం రేపుతోంది

అయితే అసలు విషయం ఏటంటే.. సమంత ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున ఖుషి సినిమా ప్రమోషన్స్ లో సమంత ఎక్కువగా పాల్గొనట్లేదు. వీలైనంత వరకు విజయ్ దేవరకొండనే ఈ ఖుషి సినిమాను అన్నీ చోట్లకు వెళ్లి ప్రమోట్ చేస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ, సమంత ఖుషి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక వీడియో కాల్ చేసి దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా, ప్రస్తుతం ఆ వీడియో కాల్ నెట్ లో వైరల్ గా మారింది. సరదాగా సాగిన ఈ వీడియో కాల్ సమంత విజయ్ చెప్పిన జోక్ కి నవ్వడం, విజయ్ దేవరకొండ సమంత కోసం సాంగ్ పాడటం అందరి ఆకట్టుకుంటుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు