Kushi Movie Release: ఇండస్ట్రీకి సామ్, విజయ్‌లే పెద్ద దిక్కు… ఏం చేస్తారో ?

Kushi Movie Release

తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు మార్మోగిపోతుంది. అప్పుడు అకాడమి అవార్డ్స్‌తో సినీ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకున్న టాలీవుడ్, ఇప్పుడు నేషనల్ అవార్డ్స్‌తో మరోసారి తెలుగు చలన చిత్ర పరిశ్రమ తన సత్త ఏంటో చూపించింది. ఇలా దిగ్విజయంగా ఉంటున్న తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గత కొన్ని వారాల నుంచి తెలుగులో విడుదలవుతున్న సినిమాలేవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.

జైలర్ లాంటి డబ్బింగ్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో కోట్లు కొల్లగోడుతున్నాయి. కానీ, టాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడి డిజాస్టార్‌లుగా మారిపోతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ BRO, ఇండస్ట్రీకి పెద్దన్న అని భావించే చిరంజీవి మూవీ భోళా శంకర్‌తో పాటు ఇటీవల వచ్చిన చిన్న చితక సినిమాలు కూడా ప్రేక్షకుల చేత ఈలలు వేయించడంలో ఫెయిల్ అయ్యాయి.

గత వారం భారీ అంచనాలతో వచ్చిన గాంఢీవధారి అర్జున, బెదురులంక 2012 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. ఇప్పుడు ఇండస్ట్రీకి అర్జెంట్‌గా పరువు నిలబెట్టుకునే సినిమా ఒకటి కావాలి. అది ఏంటా అని చూస్తే ఖుషి. విజయ్, దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న ఈ సినిమాపై బజ్ కావాల్సినంత ఉంది. దీనికి తోడు ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ క్లాసికల్ టాక్ తెచ్చుకోగా, ట్రైలర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

- Advertisement -

ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న హైప్‌ని చూస్తే, కొంత మేర పాజిటివ్ టాక్ వచ్చినా, ఖుషి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఒక వేళ ఖుషి కూడా నెగిటివ్ టాక్ వచ్చిందంటే, సలార్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సలార్ (Salaar) కి ముందు సెప్టెంబర్ 7న జవాన్ వస్తోంది. అయితే ఇది హిందీ మూవీ. జవాన్ తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. కానీ, దాన్ని తెలుగు ఇండస్ట్రీ ఖాతాలో వేసుకోలేం.

కాబట్టి… వరుస డిజాస్టర్లతో తికమకమవుతున్న టాలీవుడ్ ఆశలన్నీ ఖుషిపైనే ఉన్నాయి. ఒక వేళ ఖుషి నిరాశపరిస్తే సెప్టెంబర్ 28 వరకు తెలుగు ఆడియన్స్ వేచి చూడాల్సిందే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు