Best Actor Award: బ్యాడ్ లక్ అంటే చరణ్‌దే..!

Best Actor Award

ఒక హీరోగా ఎంత గుర్తింపు.. క్రేజ్ వచ్చినా, బెస్ట్ యాక్టర్ అనే అవార్డ్ అందుకుంటే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం ఈ కిక్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తున్నాడు. అల్లు అర్జున్‌కి ఈ అవార్డ్ వచ్చింది అనే చర్చ కంటే, రామ్ చరణ్, తారక్, సూర్యలకు ఎందుకు రాలేదు అనే చర్చనే ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్‌లో చరణ్ & తారక్ ఫర్మామెన్స్ చూసిన తర్వాత వీరిద్దరిలో ఎవరికో ఒకరికి నేషనల్ అవార్డ్ పక్కా అని అనుకున్నారు అంతా.

కానీ, అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్‌కి అవార్డు వచ్చింది. ఇలా మెగా ఫ్యాన్స్ కొంత వరకు హ్యాపీగానే ఉన్నా రామ్ చరణ్‌కు అవార్డ్ రాలేదే అనే బాధ కూడా ఉంది.

రామ్ చరణ్ నేషనల్ అవార్డ్ లకు నామినేట్ అవ్వడం ఇది తొలిసారేమీ కాదు. ఏకంగా మూడు సార్లు నేషనల్ అవార్డ్స్ కి నామినేట్ అయ్యాడు. ఫస్ట్ టైం మగధీర, సెకండ్ టైం రంగస్థలం సినిమాలకి గాను నామినేట్ అయ్యాడు. రీసెంట్‌గా ట్రిపుల్ ఆర్.

- Advertisement -

ఇలా ముచ్చటగా మూడు సార్లు బెస్ట్ యాక్టర్ బరిలో ఉంటే, ప్రతి సారి నిరాశే ఎదురైంది. అయితే రామ్ చరణ్‌కి అవార్డ్స్ రాకున్నా, గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వచ్చింది.. కోట్లాది మంది అభిమానం దక్కింది అంటూ మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు