Mega Dijasters in a Row: అక్కినేని వారిలాగే మెగా హీరోలకు బ్యాడ్ టైమ్..!

Mega Dijasters in a Row

గత కొంత కాలంగా అక్కినేని హీరోలను వరుస డిజాస్టర్స్ వెంటాడుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున గత చిత్రం ఘోస్ట్ తో మొదలైన ఈ బ్యాడ్ టైమ్ అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏజెంట్, నాగచైతన్య కస్టడీ సినిమా వరకు కొనసాగింది. ఇప్పుడు మెగా హీరోలకు కూడా ఇదే పరిస్థితి వచ్చి పడింది. ఈ ఏడాది బిగినింగ్ లో చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోగా, తర్వాత మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని గుడ్ స్టార్ట్ ఇచ్చారు.

అయితే, తర్వాత పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా అంచనాలు అందుకోలేకపోవటం, తర్వాత చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్లో వచ్చిన భోళాశంకర్ డిజాస్టర్ అయ్యింది. తాజాగా వరుణ్ తేజ్ కి గాండీవధారి అర్జున రూపంలో మరో డిజాస్టర్ వచ్చి పడింది.

మెగా హీరోలకు వరుస డిజాస్టర్స్ రావటమే కాకుండా ఇటీవల అనౌన్స్ చేసిన నేషనల్ అవార్డ్స్ లో రామ్ చరణ్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు మిస్ అవ్వటంతో మెగా ఫ్యాన్స్ నిరాశకి గురయ్యారు. అక్కినేని హీరోలలాగే మెగా హీరోలకు కూడా బ్యాడ్ టైమ్ నడుస్తోందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

- Advertisement -

నేషనల్ అవార్డ్స్ నామినేషన్స్ లో రామ్ చరణ్ పేరు అనౌన్స్ చేయగానే RRR సినిమాలో పర్ఫామెన్స్ కి గాను చరణ్ కి ఈ సారి తప్పకుండా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వస్తుందని భావించారు. గతంలో కూడా మగధీర, థిరంగస్థలం సినిమాల విషయంలో కూడా చరణ్ నేషనల్ అవార్డు వస్తుందని భావించగా నిరాశ ఎదురైంది.

మొత్తానికి ఈ ఏడాది నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా సత్తా చాటినప్పటికీ బెస్ట్ యాక్టర్ అవార్డు తమ అభిమాన హీరోకు రాలేదన్న అసంతృప్తి మెగా ఫ్యాన్స్ నుండి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో వస్తున్న ఓజి, రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీదనే పెట్టుకున్నారు. మరి, రాబోవు సినిమాలతో అయినా మెగా హీరోల డిజాస్టర్స్ కి బ్రేక్ వేస్తాయా లేదా చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు