Kollywood Talk: ప్రైవేట్ పార్ట్స్‌ను ప్రెస్ చేశాడు… నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు..!

Kollywood Talk

కొందరు నటీనటులు సినిమాలకంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతుంటారు. అలాంటి నటుల్లో హీరోయిన్ కస్తూరి ముందు వరుసులో ఉంటుంది. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించి ఎంతో మంది మనసు దోచేసిన కస్తూరి.. ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తుంది.

ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే కస్తూరి తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే పలు ఇంటర్వ్యూలతోనూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.

తాజాగా కోలీవుడ్ స్టార్స్ అసోసియేషన్ ఈవెంట్ లో పాల్గొన్న కస్తూరి తనపై లైంగిక దాడి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా కింగ్ ఆఫ్ కోత సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఓ షాకింగ్ న్యూస్ బయటపెట్టారు. ఓ సందర్భంలో తను ఫ్యాన్స్ నుంచి ఎదుర్కొన్న ఘటనను వివరించారు. ఓ మహిళా అభిమాని తనను అసభ్యంగా తాకిందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేశారు.

- Advertisement -

“సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఒక ఈవెంట్ ను ప్రముఖ సంస్థ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత కూడా జనం భారీగా తరలివచ్చారు. నేను వెళ్ళిపోతున్న సమయంలో ఎవరో నన్ను వెనకనుండి నొక్కుతున్నట్లు అనిపించింది. ఆ సమయంలో మా నాన్న నాతోనే ఉన్నాడు. నేను వెంటనే అతడి చెయ్యి పట్టుకుని ముందుకి లాగాను. దీంతో వాడు విపరీతంగా ఏడ్చాడు. అక్క సారీ అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఇలాంటి చెత్త పనులు చేసి అక్క అని వేడుకోవడం ఎందుకు” అని ఎమోషనల్ అయ్యింది. దీంతో కస్తూరి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు