Baby: అదృష్టం అంటే బేబీ డైరెక్టర్ దే !

Baby

బేబీ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ మరీ ఏ ముహూర్తాన మొదలు పెట్టాడో గాని ఈ సినిమా ఒక పక్క థియేటర్స్ లో సంచనల విజయం సాధించటంతో పాటు దర్శకుడిగా సాయి రాజేష్ కు మంచి పేరును కూడా తీసుకొచ్చింది. బేబీ సినిమా రిలీజ్ తరువాత విమర్శకుల నుంచి ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంషలు అందుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం ప్రొడ్యూసర్ యస్ కె యన్ నుంచి కానుకలు అందుకుంటున్నాడు.

వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన తారాగణంగా నటించిన బేబీ సినిమా గత జులై 14 న రిలీజై, మంచి విజయాన్ని అందుకుంది. బేబీ సినిమా రిలీజైన కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి సినిమా థియేటర్ ఫుల్ రన్ లో దాదాపు 90 కోట్ల గ్రాస్ ను సాధించి, అందరిని ఆశ్చర్య పరిచింది.

ఇక లేటెస్ట్ గా చూస్తే బేబీ సినిమా ప్రొడ్యూసర్ యస్ కె యన్ తనకు ఇంత పెద్ద సక్సెస్ ను అందించిన సాయి రాజేష్ కు నిన్న ఒక బెంజ్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. గతంలో పలు సినిమాలకు ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన యస్ కే యన్ బేబీ సినిమాతో ఫుల్ టైం ప్రొడ్యూసర్ గా మారాడు. బేబీ సినిమాపై నమ్మకం తో తన దగ్గర ఉన్న ఒక ఫ్లాట్ ను కూడా అమ్మేసి బేబీ సినిమాను తీసాడు.

- Advertisement -

ఇక ఆయన నమ్మకం ఫలించి, బేబీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించటంతో డైరక్టర్ సాయి రాజేష్ కు ఆయన బెంజ్ కారును గిఫ్ట్ గా ఇచ్చి, తన కృతజ్ఞత భావాన్ని చాటుకున్నాడు. అయితే గతంలో కూడా బేబీ సినిమా విడుదలకు ముందే యస్ కే ఎన్, డైరక్టర్ సాయి రాజేష్ ఒక హెక్టర్ కార్ గిఫ్ట్ గా ఇవ్వడం గమనార్హం. దీనిబట్టి చూస్తే సాయి రాజేష్ కు బేబీ సినిమాతో అన్ని రకాలుగా కలిసొచ్చిందనే చెప్పాలి.

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు