Mega Family: శ్రీజ ఫ్రెండ్ నే రెండో పెళ్లి చేసుకున్న కళ్యాణ దేవ్..?

Mega Family

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, శ్రీజ భర్త రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. వివరాల్లోకి వెళితే.. మెగా డాక్టర్ శ్రీజ కొణిదెల గురించి కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రీజ మొదటగా శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ పాప కూడా జన్మించింది. అలా కొంతకాలం తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తి శిరీష్ తో విడాకులు తీసుకున్న శ్రీజ మళ్లీ కుటుంబ సభ్యుల వద్దకు వచ్చేసింది.

ఆ తర్వాత కొన్నాళ్లకు కుటుంబ సభ్యులు శ్రీజను కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి పెళ్లి చేశారు. చాలా కాలం పాటు శ్రీజ, కళ్యాణ్ కలిసి ఉన్నారు. కానీ మళ్ళీ కొన్ని మనస్పర్ధల కారణంగా వీరు కూడా గత కొంతకాలంగా విడివిడిగా జీవిస్తున్నారు. ఇటీవల విడాకులు కూడా తీసుకున్నారు. కానీ వీళ్ళ విడాకుల విషయాన్ని ఇప్పటివరకు అఫీషియల్ గా కన్ఫార్మ్ చేయలేదు. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

అంతేకాదు ఆ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి శ్రీజ ఫ్రెండేనని వార్తలు వినిపించాయి. దీనికి కారణం ఏంటంటే కళ్యాణ్ దేవ్ ఫ్యామిలీ ఏదో పెళ్లికి హాజరైనట్లు తెలుస్తోంది. అందులో పెళ్లికూతురు, కళ్యాణ్ దేవ్ ఇద్దరి ఫోటోలు షేర్ చేస్తూ.. ఏకంగా కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో నెటిజెన్స్ మాత్రం కళ్యాణ్ దేవ్ పెళ్లి బట్టల్లో ఉండడం, పక్కనే పెళ్లికూతురు కూడా ఉండడంతో అతను రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ వార్తలను ప్రచారం చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు