మొదటిసారి సురేఖపై చెయ్యి చేసుకున్న చిరంజీవి.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటివాడో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి నటుడిగా ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో వ్యక్తిగతంగా కూడా అంతే మంచి పేరు సంపాదించుకున్నాడు. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఫ్యామిలీ పరంగా కూడా మెగాస్టార్ చిరంజీవి ఉన్నత స్థాయిలో నిలవడం ఆయన అభిమానులకు గర్వించదగ్గ విషయమని చెప్పాలి.

అయితే మెగాస్టార్ చిరంజీవి ఇంతగా తన సినిమాలపై దృష్టి పెట్టి రాణించడానికి కారణం తన భార్య సురేఖ అని అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో చెప్పుకొచ్చారు. అలాంటి చిరంజీవి మొట్టమొదటిసారి సురేఖ పై చేయి చేసుకున్నాడట. అందుకు కారణం మరెవరో కాదు.. వారి కూతురు శ్రీజ. ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరును సంపాదించుకున్న చిరంజీవి పరువును ఆయన కూతురు గంగలో కలిపేస్తుంది అంటూ మెగా ఫ్యాన్స్ ఇప్పటికే మండిపడుతున్న విషయం తెలిసిందే.

అయితే మొదటిసారి భర్తతో విడాకులు తీసుకొని ఇంటికి వచ్చిన శ్రీజను క్షమించిన సురేఖ రెండవసారి భర్తతో విడాకులు అనేసరికి చెంప చెల్లుమనేలా కొట్టిందట. మొదటిసారి అలా అయ్యింది.. ఇప్పుడు రెండోసారి ఇలా అయితే మీ నాన్న పరువు పోతుంది అంటూ శ్రీజని ఎప్పుడూ ఏమీ అనని సురేఖ మొదటిసారి చేయి చేసుకుందట. ఈ క్రమంలోనే శ్రీజ అంటే మొదటి నుండి ఎంతో ఇష్టం ఉన్న చిరంజీవి ఆ కోపంలో సురేఖ పై చేయి చేసుకున్నాడని.. ఆ తర్వాత తప్పు తెలుసుకొని సారీ చెప్పాడట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సురేఖ చేసిన పని కరెక్ట్ అంటున్నారు జనాలు. ఓ తల్లిగా తన కూతురి జీవితాన్ని చక్కదిద్దాలన్న ఆరాటం ఏ తల్లి లోనైనా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు