Baby: వైష్ణవి చైతన్య వన్ అవర్ వీడియో కోసం సోషల్ మీడియాలో రచ్చ

Baby

సోషల్ మీడియా ద్వారా జరిగే మంచి విషయాలను వేళ్ళ మీద లెక్కపెడితే, చెడు విషయాలను మాత్రం క్యాలిక్యూలేటర్ తో కౌంట్ చేయొచ్చు. ఈ ఒక్క స్టేట్మెంట్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియా ద్వారా ఎంత నెగిటివి స్ప్రెడ్ అవుతుందోనని. సామాన్య జనం నుంచి, పెద్ద పెద్ద సెలెబ్రెటీల వరకు కూడా ఈ సోషల్ మీడియా దాటికి గురై ..డిప్రెషన్స్ కు వెళ్లి ఆరోగ్యం పాడుచేసుకున్న వాళ్ళు లేకపోలేదు. అయితే ఇదంతా ఇప్పడు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే గతకొద్ది రోజులుగా బేబీ సినిమాపై వచ్చిన ఒక కామెంట్ సోషల్ మీడియాలో ఇప్పటి వరకు వైరల్ అవుతునే ఉంది.

సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం బేబీ. గత జులై 14 న థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలలోనే సంచలనం సృష్టించింది. దాదాపు 90 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిన ఈ బేబీ సినిమా ఇటీవలనే ఆహా ఓటిటిలో రిలీజయ్యింది.

యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య ఒక ఇమ్మెచ్యూర్ కాలేజ్ స్టూడెంట్ గా నటించింది. తాను ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా ఉండటానికి మరొక అబ్బాయితో ఎంత దూరం దాక అయిన వెళ్లడానికైన సిద్దపడే అమ్మాయి పాత్రలో వైష్ణవి అభినయించింది. అయితే మొదటి సినిమాకే ఇలాంటి ఒక బోల్డ్ క్యారెక్టర్ చేసినందుకు గాను వైష్ణవికి సర్వత్రా ప్రశంషలు దక్కాయి. కాగా ఈ సినిమాలో వైష్ణవి స్క్రిప్ట్ పరంగా డిమాండ్ చేయడం వల్ల కొన్ని ఇంటిమెంట్ సీన్స్ లోను నటించింది. ఈ సీన్స్ కు కూడా థియేటర్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

అయితే ఇటీవలనే ఈ బేబీ సినిమా ఓటిటిలోకి రావడంతో సోషల్ మీడియాలో అంత వైష్ణవి చైతన్య వన్ అవర్ ఇంటిమేట్ సీన్స్ పెట్టండి అంటూ బేబీ సినిమా మేకర్స్ ను పదే పదే కామెంట్స్ లో అడుగుతూ వచ్చారు కొంతమంది అల్లరి మూకా. అయితే ఈ కామెంట్స్ కొన్ని రోజుల వరకు సరదాగానే సాగింది. కానీ ఈ సరదాతో కామెంట్స్ ఆగలేదు. నానాటికి ఇంకా.. ఇంకా వస్తూనే ఉన్నాయి. .బేబీ సినిమా ఓటిటి ప్రమోషన్స్ లో భాగంగా పలు ప్రశ్నలకు బేబీ టీం సమాధానం చెప్పవలసి ఉండింది. అయితే మేకర్స్ ను అడిగే ఆ ప్రశ్నలలో కూడా వైష్ణవి వన్ అవర్ వీడియో రిలీజ్ చేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు. మరీ ఇది రకమైన విజ్ఞతనో కామెంట్స్ చేసేవాళ్ళకే తెలియాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు