Kushi movie promostions : అర్జున్ రెడ్డి కాంబినేషన్ రిపీట్- త్వరలోనే ఎనౌన్స్ మెంట్

Kushi movie promostions

2017 లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అప్పటి వరకు తెలుగులో వస్తున్న మూస ధోరణి సినిమాలకు ఎండ్ కార్డు పలికింది అర్జున్ రెడ్డి.

కమర్షియల్ సినిమాలకంటూ ఒక పద్దతిని, హీరో క్యారెక్టర్ లకంటూ కొన్ని బౌండరీస్ ను పెట్టుకొని తెలుగులో సినిమాలు వస్తున్న తరుణంలో అర్జున్ రెడ్డి సినిమా వచ్చి ఆ ఫార్మాట్ అంతటిని మార్చేసింది. అర్జున్ రెడ్డి సినిమాతో గ్రే షేడ్ ఉన్న హీరో క్యారెక్టర్ లకు డిమాండ్ భారీగా వచ్చింది.గతంలో శివ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్, అర్జున్ రెడ్డి సినిమా మళ్ళీ రీ- క్రియేట్ చేసిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

మరి అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను ఇండస్ట్రీకి అందించిన సందీప్ రెడ్డి వంగ, విజయ్ దేవరకొండ కలిసి మరో సినిమా చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తునట్టు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవి శంకర్ తెలిపారు. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటిన గ్రాండ్ గా రిలీజ్ అవబోతుండటంతో అన్ని భాషలలో సినిమాను గట్టిగ ప్రమోట్ చేస్తున్నారు మూవీ టీం.

- Advertisement -

ఖుషి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ నిన్న సాయంత్రం ఖుషి మూవీ టీం తో కలిసి ఒక లైవ్ చాట్ సెషన్ ను కండక్ట్ చేసారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత రవి శంకర్ పాల్గొని, విజయ్ దేవరకొండతో మైత్రి మూవీ మేకర్స్ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమా గురించి సెన్సేషనల్ అప్డేట్ ను అందించారు.

ఖుషి సినిమా తరువాత విజయ్ దేవరకొండ మైత్రి మూవీ మేకర్స్ నుంచి రాబోయే సినిమా ఖుషి లాంటి సాఫ్ట్ సినిమాగా ఉండదని ఈసారి ఒక సాలిడ్ సబ్జెక్ట్ తో వస్తామని అని ఆయన తెలిపారు. ఆల్రెడీ తాము డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో టచ్ లో ఉన్నామని త్వరలోనే అర్జున్ రెడ్డి కాంబినేషన్ లో సినిమాని పట్టాలెక్కిస్తామని రవి శంకర్ చెప్పడంతో ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు