Rajnikanth: జైలర్ హెచ్ డీ ప్రింట్ లీక్

Jailer movie HD print leak

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా జైలర్ హెచ్ డీ ప్రింట్ నిన్న సాయంత్రం లీక్ అయింది. చాలా రోజులు గ్యాప్ తరువాత రజనీకాంత్ రేంజ్ కు కరెక్ట్ సినిమా పడిందని రజని ఫ్యాన్స్ జైలర్ సినిమాని ఒకటికి రెండు సార్లు థియేటర్స్ లో చూస్తూ.. జైలర్ సినిమాని సెలెబ్రేట్ చేసుకుంటుండగా నిన్న సాయంత్రం జైలర్ సినిమా హెచ్ డీ ప్రింట్ లీక్ అయ్యి మేకర్స్ కు షాక్ ఇచ్చింది.

విలక్షణ దర్శకుడు నెల్సన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ జైలర్ సినిమా ఆగస్ట్ 10న రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమాకు మేజర్ ప్లస్ అవ్వగా తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ ఏమి చేయకుండానే జైలర్ కు మంచి పబ్లిసిటీ వచ్చింది. మిల్క్ బ్యూటీ తమన్నా, మిర్న మీనన్, రమ్య కృష్ణ, సునీల్ ప్రధాన పాత్రలలో ఈ సినిమాలో నటించగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ లు ఈ సినిమాలో క్యామియో పాత్రలలో కనిపించారు.

డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ జైలర్ సినిమా హెచ్ డీ ప్రింట్ లీక్ నిన్న సాయంత్రం ఇంటర్నెట్ లో లీక్ అయింది. జైలర్ సినిమాకు ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ఉండడంతో ఈ సినిమా హెచ్ డీ ప్రింట్ లీక్ అయిన కొద్దీ క్షణాల్లోనే నెట్ లో వైరల్ గా మారింది. పలు టోరెంట్స్ సైట్స్ లో అన్ని భాషల ఆడియోలతో జైలర్ సినిమా నెట్ లో దర్శనం ఇవ్వడంతో థియేటర్స్ కు వెళ్లి చూడాలనుకునే వాళ్ళు ఈ లింక్స్ ద్వారానే జైలర్ సినిమాను ఫ్రీ గా చూస్తున్నారు. దీనిపై మూవీ టీం చర్యలు గనక తీసుకోకపోతే ఈ లింక్ లు మరింత వైరల్ అవడం ఖాయం.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు