JAILER: ఈ వారం కూడా జైలర్ హవానే!

Jailer 2nd week hold

టాలీవుడ్ లో గత నెలరోజులుగా సరైన తెలుగు సినిమా రాలేదన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమాలు అస్సలు రావట్లేదు. ఎప్పుడో రెండు నెలల కింద రిలీజ్ అయిన “సామజవరాగమన” తర్వాత ప్రేక్షకులని మెప్పించే సినిమా రాలేదనే చెప్పాలి. నెల కింద వచ్చిన బేబీ హిట్ అయినా అది కాలేజ్ ఆడియన్స్ ని మాత్రమే ఆకట్టుకుంది. ఇక లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల్లో భోళా శంకర్ డిజాస్టర్ అవగా, డబ్బింగ్ సినిమా జైలర్ మాత్రమే ఆకట్టుకుంది.

జైలర్ సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయినా ఫ్యామిలీ ఆడియన్స్ కొంతవరకు వెనక్కి తగ్గారు. ఎందుకంటే అందులో వైలెన్స్ ఎక్కువగా ఉంది. అయితే ఈ వారం రెండు కామెడీ సినిమాలు రావడంతో తెలుగు ఆడియన్స్ ఒక మంచి సినిమా వస్తుందని అభిప్రాయపడ్డారు. అందులో ఒకటి ప్రేమ్ కుమార్, మరొకటి మిస్టర్ ప్రెగ్నెంట్. ఈ రెండు ట్రైలర్లు కూడా బాగుండడంతో సినిమా హిట్ అవుతునని అనుకున్నారందరు.

తీరా థియేటర్లో రిలీజ్ అయ్యే సరికి ఒక్క సినిమా కూడా ఆడడంలేదు. రొటీన్ సినిమాలు అన్న టాక్ తెచ్చుకుని పూర్తిగా నిరాశ పరిచాయి. ఇక లాస్ట్ వీక్ వచ్చిన జైలర్ సినిమాకి ఈ సినిమాల రిజల్ట్స్ తో అడ్వాంటేజ్ అయింది. ఈ వారం కూడా భారీగా థియేటర్లను హోల్డ్ చేసిందని చెప్పవచ్చు. దాంతో రెండో వారం జైలర్ మరో 10కోట్ల వరకు కలెక్షన్లను హోల్డ్ చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక వచ్చేవారం గాండీవధారి అర్జున, బెదుర లంక తో పాటు, కింగ్ అఫ్ కొత్త కూడా రిలీజ్ అవుతున్నాయి, కాబట్టి అప్పటి వరకు జైలర్ హవా కంటిన్యూ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు