Chandumondeti: చై సినిమాలో ఈ ఇద్దరిలో ఎవరు?

Chandu mondeti:

ప్రస్తుతం నాగచైతన్య మీడియం రేంజ్ హీరోల్లో అందరికంటే బ్యాడ్ సిట్యుయేషన్ లో ఉన్నాడు. తాను నటించిన థ్యాంక్ యు, కస్టడీ డిజాస్టర్లు అవడంతో తన నెక్స్ట్ సినిమాపై కసరత్తులు గట్టిగా చేస్తున్నాడు. పైగా అక్కినేని హీరోల్లో అందరూ ప్లాపుల్లోనే ఉండడంతో అక్కినేని ఫ్యామిలీ పరువు కాపాడాల్సిన బాధ్యత నాగచైతన్య పై పడింది. ఇక ఇప్పుడు నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం ఇప్పటివరకు ఫైనలైజ్ కాలేదు. డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమాకి ఇద్దరు హీరోయిన్లలో ఒకరిని తీసుకోవాలని ఆలోచిస్తున్నాడని టాక్. అయితే ఆ ఇద్దరిలో ఒకరు మహానటి కీర్తి సురేష్ కాగా, ఇంకొకరు సాయి పల్లవి. ఇద్దరు నటనలో ఆరితేరిన వాళ్లే. అయితే ఈ ఇద్దరిలో ఎవర్ని తీసుకోవాలో తెలియక చందు మొండేటి ఆలోచనలో పడ్డాడు.

అయితే నాగచైతన్య సాయి పల్లవినే సజ్జెస్ట్ చేస్తున్నట్టు సమాచారం. కీర్తి సురేష్ ప్రస్తుతం ప్లాపుల్లో ఉండడం ఒక కారణం అయితే, సాయి పల్లవి తో చేసిన లవ్ స్టోరీ బ్లక్ బస్టర్ హిట్ అవడం ఇంకో రీసన్. దాంతో కాంబో హైప్ తో సినిమాకి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మేకర్స్ కూడా అనుకుంటున్నారని సమాచారం. అయితే ఇందులో నిజమెంతో తెలియదు గాని, సాయి పల్లవి నటిస్తే సినిమా సక్సెస్ లో సగభాగం తనకే పోతుంది. అలా కాకుండా ప్లాప్స్ లో ఉన్న కీర్తికి ఛాన్స్ ఇస్తే సినిమా హిట్ అయితే ఎక్కువ క్రెడిట్ నాగ చైతన్యకే ఆవస్తుదంటున్నారు ఫ్యాన్స్. మరి చూడాలి ఏం జరుగుతుందో.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు