Naga Chaitanya: కస్టడీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కస్టడీ. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్’ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

గత కొంత కాలంగా అక్కినేని ఫ్యామిలీ లో అందరికి ప్లాప్స్ వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఏజెంట్ సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ కొట్టి ఈ ప్లాపుల పరంపరకు చెక్ పెట్టాలని చూస్తున్నాడు ఈ అక్కినేని వారసుడు. నాగచైతన్య ఈ సినిమాలో మొదటి సారి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలకు డేట్ ఫిక్స్ చేసుకుంది.

కస్టడీ థియేట్రికల్ ట్రైలర్ ను మే 5 న విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ ట్విట్టర్ పేజీ లో అనౌన్స్ చేసారు. ఇక ఈ మూవీలో ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్జీ అమరెన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కస్టడీ మూవీ మే 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా తో హిట్ కొట్టి నాగ చైతన్య ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు