NBK108: ఈ స్టార్ హీరోయిన్ కి ఇక యంగ్ స్టర్స్ తో ఛాన్సులు రావా?

కాజల్ అగర్వాల్.. ఒకపుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్. 2007 లో లక్ష్మి కళ్యాణం చిత్రం తో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన కాజల్, ఆ తర్వాత మగధీర సినిమా తో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమా తో వరుస ఆఫర్లను దక్కించుకొని ఇండస్ట్రీ లో టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లింది. డార్లింగ్, బృందావనం, నాయక్, బిజినెస్ మ్యాన్ వంటి సూపర్ హిట్లతో గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అయితే 2016 తర్వాత కాజల్ అగర్వాల్ టాప్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించలేదు. ఎక్కువగా సీనియర్ హీరోలతో, మీడియం రేంజ్ హీరోలతో నటిస్తూ వస్తుంది.

2020 అక్టోబర్ లో బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా కాజల్ సినిమాలు చేసింది. అయితే 2022 లో కాజల్ ఏప్రిల్ లో కాజల్ ఒక బిడ్డ కు తల్లి అయింది. అప్పట్నుంచి సినిమాలకు కొంత దూరం అయింది. అయితే సినిమాలపై ఇష్టం తో కొంత విరామం తీసుకొని మళ్ళీ సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. తెలుగులో చివరగా 2021 లో వచ్చిన మోసగాళ్లు మూవీలో కాజల్ నటించింది. ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబో లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ అందరితోను హీరోయిన్ గా చేసిన తనకు ఇప్పుడు ఏ టాప్ స్టార్ సినిమాలోనూ ఆఫర్ రాలేదు. మరి కాజల్ ఇప్పుడు సీనియర్ హీరోలతోనే చేయల్సిన పరిస్థితి వచ్చిందా? ఇక యంగ్ స్టర్స్ తో ఛాన్సులు రావా అంటూ కాజల్ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు. రీసెంట్ గా కాజల్ నటిస్తున్న సినిమాల్లో సీనియర్ హీరోలే ఉన్నారు. కమల్ హాసన్ తో ఇండియన్ 2 లో నటిస్తుండగా బాలకృష్ణ తో NBK 108 లోనూ చేస్తుంది. మరి టాప్ హీరోల సరసన ఫ్యూచర్ లో అయినా ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు