Ugram : అల్లరి నరేష్ చాలా గ్రేట్ -మిర్నా మీనన్

విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తోన్న చిత్రం ఉగ్రం. గతంలో వీరిద్దరి కాంబినేషలో వచ్చిన నాంది సినిమా సూపర్ హిట్ అవడంతో ఉగ్రం సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. షైన్ స్క్రీన్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అల్లరి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

అయితే ఈ సినిమాలో నరేష్ కి జోడిగా మలయాళ బ్యూటీ మిర్నా మీనన్ నటిస్తుంది. గతంలో ఈమె ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన క్రేజీ ఫెల్లో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో ఇప్పుడు ఉగ్రం సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఈ శుక్రవారం సినిమా రిలీజ్ అవుతుండటంతో మూవీ కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న (సోమవారం)  కండక్ట్ చేసారు. విశ్వక్ సేన్, నిఖిల్, సందీప్ కిషన్, అడవి శేష్ ప్రముఖ అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా మిర్నా మీనన్ అల్లరి నరేష్ గురించి మాట్లాడుతూ ” 60 సినిమాలు చేయడమంటే నిజంగా చాలా గ్రేట్, మీ 60వ సినిమాలో హీరోయిన్ గా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఉగ్రం లాంటి మంచి టీమ్ తో పని చేయడం అదృష్టంగా ఫీల్ అవుతున్న, ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ విజయ్ కి చాలా థాంక్స్ ” అని చెప్పింది. ప్రస్తుతం మిర్నా నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వస్తోన్న జైలర్ సినిమాలో నటిస్తుంది. ఉగ్రం సినిమాపై మంచి అంచనాలు ఉండటంతో ఈ సినిమాతో టాలీవుడ్ బ్రేక్ వస్తుందని చూస్తుంది ఈ అమ్మడు. మరి అనుపమ పరమేశ్వర్ ,సంయుక్త మీనన్ లాంటి మలయాళం హీరోయిన్లు టాలీవుడ్ లో బిజీ అయినట్టు మిర్నా కూడా బిజీ అవుతుందో లేదో చూడాలి

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు