Agent: సినిమా డిజాస్టరైనా ఈ హీరోయిన్ మాత్రం ఎంజాయ్ చేస్తుంది

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ను ఏకే ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించారు. హిప్ హాప్ తమిజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ముంబై బ్యూటీ సాక్షి వైద్య నటించింది. అయితే ఏప్రిల్ 28న భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. తొలి షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో అది ఒక్కసారిగా స్ప్రెడ్ అయిపోయి సరైన ఓపెనింగ్స్ కూడా రాకుండా చేసింది. ఇప్పుడు అఖిల్ కెరీర్ లోనే ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. 36 కోట్లకి పైగా బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటివరకు ఆరు కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఏజెంట్ సినిమా దాదాపు 30 కోట్ల లాస్ ని సొంతం చేసుకుని టైర్ 2 హీరోల సినిమాల్లో లైగర్ తర్వాత అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

అయితే సినిమా విడుదలై రోజులు గడుస్తున్నకొద్దీ చిత్ర యూనిట్ అందరూ ఏజెంట్ గురించి మర్చిపోతున్నారు. సినిమా ప్లాప్ అయినందుకు ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ట్విట్టర్ లో ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్పాడు. హీరో అఖిల్ గాని సురేందర్ రెడ్డి గాని సోషల్ మీడియా లో యాక్టీవ్ గా లేరు. అయితే ఒక్కరు మాత్రం సినిమా డిజాస్టర్ అయినా తన వరకు ఎంజాయ్ చేస్తున్నారు. అదెవరో కాదు ఈ సినిమా లో స్పెషల్ సాంగ్ చేసిన ఊర్వశి రౌటేలా. ఈ బాలీవుడ్ భామ ఏజెంట్ లో వైల్డ్ సాలా అంటూ ఐటెం సాంగ్ చేసింది. సినిమా విడుదల కాక ముందు నుంచి మూవీలో క్లిప్స్ తన ఇన్స్టా గ్రామ్ పేజీలో పెడుతూ సందడి చేసింది.

అయితే ఇప్పుడు ఏజెంట్ డిజాస్టర్ అయినా కూడా తన ఇన్స్టా లో తాను చేసిన సాంగ్ యొక్క థియేటర్ హుంగామా స్టేటస్ పెడుతూ ఎంజాయ్ చేస్తుంది. బహుశా ఈ సినిమా డిజాస్టర్ అయిందని తనకి తెలియదా? లేదంటే తన పాటకి మాత్రమే సంతోషపడుతుందా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ లో థియేటర్లో ఫస్ట్ డే ఫ్యాన్స్ చేసే రచ్చ ఈ అమ్మడికి బాగా నచ్చినట్టుంది. అందుకే ఇప్పటికీ స్టేటస్ లు పెడుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు