OkkaMagadu: రీ రిలీజ్ అవుతున్న బాలయ్య కళా ఖండాలు?

Okka magadu Re release

టాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుందన్న సంగతి తెలిసిందే. మొన్న మొన్నటి వరకు పెద్ద హీరోల సినిమాలే రిలీజ్ అయ్యేవి. అది కూడా వాళ్ళ బర్త్ డే సందర్భంగా, లేదా ఆ సినిమాల ఆనివర్సరీ ల సందర్భంగా రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్న సినిమాలు అసలు సందర్భమే లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి. గతంలో ఆరెంజ్ లాంటి క్లాసిక్ సినిమా రీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అవగా, రీసెంట్ గా సూర్య సన్ అఫ్ కృష్ణన్ రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది.

ఒక డబ్బింగ్ సినిమా కూడా రీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిందంటే ఆశ్యర్యపోతున్నారు నెటిజన్లు. దీనికి కొనసాగింపుగా తాజాగా రఘువరన్ బి.టెక్ కూడా రీ రిలీజ్ అయి థియేటర్లలో ఆడుతుంది. అయితే ఏ సినిమా వచ్చినా ఆడుతుందన్న నమ్మకమో, లేక అతిపైత్యమో తెలీదు గాని, ఇప్పుడు బాలకృష్ణ నటించిన రెండు పాత కళా ఖండాలు రీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

అవును.. బాలకృష్ణ హీరోగా నటించిన “ఒక్క మగాడు” ఆ రోజుల్లో ఎంత పెద్ద డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాని టీవీల్లో ఇప్ప్పటికీ టెలికాస్ట్ చేయాలంటే జంకుతారు. బాలయ్య కెరీర్ లో ఎప్పుడూ లేనని ట్రోల్స్ ఎదుర్కున్న సినిమాగా ఒక్క మగాడికి రికార్డు ఉంది. అలాంటి సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నామని కొందరు బయ్యర్లు ప్రకటించారు.

- Advertisement -

ఇదే కాదు 2015 లో బాలకృష్ణ నటించిన లయన్ సినిమా కూడా రీ రిలీజ్ అవుతుందని ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. అయితే రీ రిలీజ్ అయితే ఏదైనా క్లాసిక్ హిట్ సినిమాని చేయాలిగాని, బాలకృష్ణ కి ఎందుకూ ఉపయోగపడని ఎలాంటి సినిమాలని ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నారని ఆ అనౌన్స్ మెంట్ ఇచ్చిన బయ్యర్లకి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వీటికి బదులుగా బాలకృష్ణ నటించిన ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి క్లాసిక్ హిట్స్ ని రీ రిలీజ్ చేయచ్చుగా అని అంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates,Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు