Umapathi: తెలుగులో అవికా కెరీర్ ముగుస్తోందా?

Umapathi movie

టాలీవుడ్ లో హీరోయిన్లకు కొదవలేదని అంటుంటారు. ఒక హీరోయిన్ ఫేడ్అవుట్ అయ్యేలోపే మరో హీరోయిన్ పరిచయమవుతుంది. అయితే ఏ హీరోయిన్ పరిచయమైనా స్టార్ డమ్ లేకపోతే ఐదారు ఏళ్లకే టాలీవుడ్ లో కెరీర్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్ లోనే ఉంది అవికాగోర్. ఉయ్యాలా జంపాల తో పరిచయమైన ఈ భామ, అంతకు ముందే చిన్నారి పెళ్లికూతురు అనే డబ్బింగ్ సీరియల్ ద్వారా ఆడియన్స్ కి సుపరిచితం. అయితే ఈ హీరోయిన్ కి కెరీర్ మొదట్లో అవకాశాలు బాగానే వచ్చాయి. పెద్ద సినిమాల్లో అంతగా అవకాశాలు రాకపోయినా, చిన్న సినిమాల్లో మాత్రం ఓ వెలుగు వెలిగింది.

సినిమా చూపిస్తా మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో హిట్లు కూడా కొట్టినా, అవి ఈ హీరోయిన్ కెరీర్ కి అంతగా హెల్ప్ అవలేదు. ఇక గత నాలుగైదు ఏళ్లుగా అవికాగోర్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఈమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. రీసెంట్ గా పాప్ కార్న్ అనే సినిమాలో కనిపించిన ఈ భామ ఆ సినిమాతో కూడా డిజాస్టర్ అందుకుంది. ఇక అవికా చేతిలో ఇప్పుడు ఉమాపతి అనే ఒకే ఒక్క సినిమా మాత్రమే ఉంది. 2023 నవంబర్ లో ఆ సినిమా రానుంది. మరి ఈ సినిమాతో అయినా అవికా గోర్ సక్సెస్ కొట్టకపోతే తన కెరీర్ టాలీవుడ్ లో ప్రశ్నార్థకం గా మిగులుతుంది.

ఇక రీసెంట్ గా హిందీలో 1920అనే హర్రర్ సినిమాలో నటించగా, ఆ సినిమా అంతగా మంచి రెస్పాన్స్ తెచ్చుకోలేదు. కానీ ప్రాఫిట్స్ వచ్చాయి. మరి అవికాగోర్ సినిమాలతో సక్సెస్ కొట్టకపోతే అవికాగోర్ కి సైడ్ రోల్సే దిక్కు అని అంటున్నారు నెటిజన్లు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు