Premkumar: రెండు కామెడీ జొనర్లే.. మరి ఆడియన్స్ ఓటు దేనికి?

Premkumar, Misterpregnent

టాలీవుడ్ లో లాస్ట్ వీక్ రెండు పెద్ద సినిమాలు ఓ చిన్న సినిమా రిలీజ్ అయ్యాయి. అయితే అనూహ్యంగా ఈ సినిమాల్లో డబ్బింగ్ సినిమా జైలర్ బ్లాక్ బస్టర్ అవగా, తెలుగు సినిమా భోళా శంకర్ ప్లాప్ అయింది. ఇక మరో చిన్న సినిమా ఉస్తాద్ ని ఆడియన్స్ అసలు పట్టించుకోనేలేదు. ఇక ఈ వారం రెండు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పేరుకి చిన్న సినిమాలే అయినా, ట్రైలర్లు ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో మంచి బజ్ ఏర్పడింది. అయితే ఈ రెండు సినిమాలు కూడా కామెడీ నేపథ్యంలో వచ్చిన సినిమాలే కావడం గమనార్హం.

ఈ రెండింట్లో ఒకటి సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్ అయితే, మరొకటి బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా నటించిన “మిస్టర్ ప్రెగ్నెంట్”. సంతోష్ శోభన్ నటిస్తున్న సినిమాలో హీరోకి చాలా సార్లు పెళ్లి ఫిక్స్ అయ్యి ఎదో ఒకరకంగా పెళ్లి క్యాన్సల్ అవుతుంది. ఇక హీరోకి పెళ్లి అవుతుందా? అయితే ఎలా అవుతుంది అనేదే స్టోరీ. చాలా చిన్న కాన్సెప్టే అయినా, ట్రైలర్ ఎంతో ఆసక్తిగా ఉంది. ఇక మరో సినిమా “మిస్టర్ ప్రెగ్నెంట్” విషయానికి వస్తే ఒక మేల్ పర్సన్ ప్రెగ్నెంట్ అయితే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి అన్న కాన్సెప్ట్ తో వస్తుంది.

మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా, అక్కడక్కడా బాలీవుడ్ మూవీ మిస్టర్ మమ్మీ సినిమాను మక్కికిమక్కి దించేసినట్టు అనిపిస్తుంది. అయితే తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ప్రేమ్ కుమార్, మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలు ఆగస్టు18న రిలీజ్ అవుతున్నాయి. మరి కంటెంట్ పరంగా రెండు సినిమాలు రొటీన్ గానే ఉన్నప్పటికీ ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నెగ్గుతుందో, ఏ మూవీ విఫలమవుతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు