Tollywood: వచ్చింది 7 సినిమాలు.. కానీ ఒక్కటీ హిట్ కాలేదు

టాలీవుడ్ లో ఈ వారం ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో పెద్ద సినిమాలు లేకపోయినా, మినిమం అంచనాలున్న సినిమాలైతే వచ్చాయి. గతవారం రిలీజ్ అయిన అరడజను సినిమాల్లో “సామజవరగమన” మాత్రమే హిట్ కాగా వేరే సినిమాలన్నీ ఢమాల్ అయ్యాయి. అలాగే ఈ వారం కూడా దాదాపు 7 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి.

అందులో ఆడియన్స్ కి ఎక్కువగా తెలిసిన సినిమాలు భాగ్ సాలే, రంగబలి, రుద్రంగి సినిమాలున్నాయి. మిగతా సినిమాలు అసలు రిలీజ్ అయ్యాయని కూడా తెలియదు. భాగ్ సాలే సినిమాలో శ్రీ సింహా హీరోగా నటించాడు. కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో కామెడీ ఆకట్టుకున్న కథనం రొటీన్ గా ఉండడంతో ప్రేక్షకులను మెప్పించలేదు.

ఇక ఆ తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి ముందునుండే అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. కానీ స్టార్ క్యాస్ట్ ఉండడంతో ఏమైనా మెప్పిస్తుందనుకున్నారు. కానీ దారుణమైన టాక్ ని మూటగట్టుకుంది. ఇక జగపతి బాబు నటించిన రుద్రంగి కూడా మేకింగ్ పరంగా బాగానే ఉన్నా చిత్ర కథనం ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. అలాగే అంతా కొత్తవారితో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 7:11పీఎం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

- Advertisement -

ఇవే గాక “ఓ సాథియా”, లిల్లీ, సర్కిల్ అనే మూడు సినిమాలు కూడా విడుదలయ్యాయి. ఇందులో అసలు ఎవరు నటించారో కూడా ఆడియన్స్ కి తెలీదు. అంతలా ఈ సినిమా రూపొందాయి. పైనున్న వాటిలో బ్యాడ్ టాక్ వచ్చినా వీకెండ్ వరకు నిలబడగలదంటే అది బహుశా భాగ్ సాలే సినిమాకి కావచ్చు. ఈ సినిమాల ఫలితం తో గతవారం విడుదలైన సామజవరగమన చిత్రానికి మరో వారం అడ్వాంటేజ్ లభించినట్లే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు