Sree vishnu: సామజవరగమన చిత్రానికి మరో వారం అడ్వాంటేజ్..

టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు హీరోగా సామజవరగమన అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. గత వారం జూన్29న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. టాలీవుడ్ లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి మౌత్ టాక్ తెచ్చుకుని భారీ కలెక్షన్లు రాబడుతుంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయిన ఈ సినిమా జరిగిన బిజినెస్ కి రెట్టింపు వసూలు చేసి డబల్ బ్లాక్ బస్టర్ అయింది.

ఇక ఇప్పుడు సామజవరాగమన చిత్రానికి కలెక్షన్లలో మంచి జోరు చూపించే ఛాన్స్ మళ్ళీ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్కటి కుడా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. పైగా అందులో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయని కూడా ప్రేక్షకులకు తెలియదు. ఇది సామజవరగమన సినిమాకి భారీ అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. ఈ వారం కూడా మంచి గ్రోత్ చూపిస్తే ఈ సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పొచ్చు.

మొదటి వారం 7 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా తొమ్మిది రోజులు ముగిసేసరికి 9కోట్లకి పైగా షేర్ సాధిచింది. ఓవరాల్ గా ఇప్పటివరకు 17కోట్ల గ్రాస్ వసూలు చేయగా, 25కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ సినిమా ఓవర్సీస్ లో భారీ కలెక్షన్లు రాబడుతుంది. ఇక సామజవరగమన సినిమాతో ఇటు శ్రీ విష్ణు కి, అటు ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర కి మంచి కమ్ బ్యాక్ లభించిందని చెప్పవచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు