Prabhas: సలార్ సాంగ్ రిలీజ్ కాన్సల్? డైరెక్ట్ గా ట్రైలరేనా?

Prabhas slaar:

టాలీవుడ్ లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ఈ ఇయర్ రిలీజ్ అవుతున్న అతిపెద్ద సినిమా “సలార్”. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ముందునుండే భారీ అంచనాలు ఉండగా, ఒక్కో ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక గత నెలలో సలార్ ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. తెల్లవారు జామున ఐదు గంటలకి రిలీజ్ చేసినా కూడా, భారీ రెస్పాన్స్ తో రికార్డు వ్యూస్ దక్కించుకుంది.

ఇక “సలార్” సినిమా సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కి సిద్ధం అవుతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. అయితే సలార్ నుండి పాఠాలేమి రిలీజ్ కావడం లేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఒక్క పాట మాత్రమే ఉంటుందని అది రిలీజ్ చేయడానికి ఇంకా టైం ఉందని అంటున్నారు. ఇక 3బిట్ సాంగ్స్ ఉంటాయని, అవి కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కలిపి వస్తాయని అంటున్నారు.

అయితే సలార్ ట్రైలర్ రిలీజ్ సెప్టెంబర్ 10 నుండి 12 మధ్యలో రిలీజ్ చేస్తారని చిత్ర యూనిట్ నుండి సమాచారం వచ్చింది. ఇక సలార్ లో ఉండే ఆ ఒక్క సాంగ్ గురించి ట్రైలర్ రిలీజ్ తర్వాతే ఆలోచిస్తారని సమాచారం. అయితే సలార్ పార్ట్ 2లో మాత్రం చాలా పాటలు ఉంటాయని అంటున్నారు.

- Advertisement -

అయితే ప్రశాంత్ నీల్ సినిమాల్లో పాటలకి కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఉంటుంది. కెజిఎఫ్ సినిమాల్లో పాటలు కూడా ఆ సినిమా హిట్ కావడానికి బాగా హెల్ప్ అయ్యాయని తెలిసిందే. మరి సలార్ లో ఒక్క పాటే ఉందంటున్నారంటే, ఈ సినిమాలో పాటలకి స్కోప్ లేదా అన్న ప్రశ్న తలెత్తుంతుంది.మరి దీని గురించి చిత్ర యూనిట్ అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చే వరకు క్లారిటీ రాదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు