Salaar: టైమ్ చెప్పి మరీ గుర్తుచేస్తున్నారంటే అంతుందా?

Salaar movie release date

రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫలితం తరువాత కసి మీదున్నాడు. పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు. ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని షూటింగ్ కి గ్యాప్ ఇవ్వకుండా, వరుస షెడ్యూల్స్ తో మొదలు పెట్టిన అన్ని సినిమాలు పూర్తి చేస్తున్నాడు. వాటిలో “సలార్” కూడా ఒకటి. లాక్ డౌన్ కి ముందే ఈ మూవీ అనౌన్స్ మెంట్ జరిగినప్పటికీ పట్టాలెక్కడానికి రెండేళ్ల సమయం తీసుకుంది. ఇక రాధేశ్యామ్ సినిమాకి ముందే ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ గ్యాప్ లో ప్రభాస్ రెండు చిత్రాలు రిలీజ్ అయ్యి డిజాస్టర్ కూడా అయ్యాయి. ఇక సలార్ విషయంలో మాత్రం అలా కాకుండా ప్రభాస్ పూర్తి ఫోకస్ పెట్టాడు. ఇక ఈ సినిమాను kgf డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుడడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఒక్క టీజర్ ద్వారానే అన్ని భాషల్లోనూ ఈ సినిమాకి హైప్ వచ్చింది.

ఇక ఈ సినిమా ప్రమోషన్లు కూడా టీజర్ నుండే స్టార్ట్ చేసారు. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా అది సెన్సేషన్ అవుతుంది. ఇక తాజాగా మూవీ మేకర్స్ సలార్ రిలీజ్ కి 50 రోజులే మిగిలి ఉందని, ఫ్యాన్స్ కి గుర్తు చేసారు. ఇంతకు ముందు కూడా వంద రోజుల్లో వస్తున్నామని మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది ఆడియన్స్ ఈ సినిమా సెప్టెంబర్ లో వస్తుదంటే నమ్మలేదు. ఎందుకంటే జులైలో ఆదిపురుష్ రిలీజ్ అయింది కాబట్టి, సలార్ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందనుకున్నారు.

- Advertisement -

కానీ మేకర్స్ పక్కా ప్లానింగ్ తో షూటింగ్ త్వరగా పూర్తి చేస్తున్నామని అంటున్నారు. అందుకే సలార్ రిలీజ్ డేట్ ని గుర్తు చేసి మరి చెప్తున్నారు.సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందని మేకర్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారని దీన్ని బట్టి చెప్పొచ్చు. మరి చూడాలి ఆ రోజు సలార్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో!

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు