Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ నికర విలువ

Saif Ali Khan

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ అంటే తెలియని వారుండరు. తాజాగా రావణుడి వేషం లో ‘ఆదిపురుష్’ సినిమా లో అందరిని ఆకట్టుకున్న సైఫ్ ఇపుడు ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’లో కనిపించబోతున్నాడు.ఈ నటుడు ఇటీవలే తన 53వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. సైఫ్ తన నటన కి మాత్రమే కాకా తనకున్న ఆస్తుల విషయం లో కూడా ప్రసిద్ధి. మరియు, సైఫ్ రాజా కుటుంబీకులకు చెందినవాడని తెలిసిందే.

ఇండస్ట్రీలోని ఇతర ఆర్టిస్టులతో పోలిస్తే సైఫ్ నెట్ వర్త్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. అతని దగ్గర ఉన్న విలువైన వస్తువులు ఇవే…

పటౌడీ మాన్షన్

- Advertisement -

సుదీర్ఘ వారసత్వాన్ని కలిగి ఉన్న కుటుంబ ఆస్తి విలువ 800 కోట్లు. ఇంత చరిత్ర కలిగిన ఈ మాన్షన్ ను సైఫ్ సినిమా షూటింగ్ ల కోసం అద్దె కు ఇస్తూ ఉంటాడు అంట. ఇటీవల రన్బీర్ కపూర్ నటిస్తున్న సినిమా ‘అనిమల్’ కు రెంట్ కి ఇచ్చినట్టు సమాచారం. ఈ పాలస్ ని రెంట్ కి ఇచ్చి సైఫ్ ఎంత సంపాదించి ఉంటాడో మన ఊహ కి అందదు.

Gstaad లో చాలెట్

సైఫ్ మరియు అతని భార్య కరీనా కపూర్ జిస్టాడ్‌లో కొనుగోలు చేసిన చాలెట్‌లో కనిపించారు. ఈ చాటెట్ కోసం సైఫ్ 35 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.

కార్ కలెక్షన్

సైఫ్‌కు కార్లంటే మహా ఇష్టం, మెర్సిడెస్ బెంజ్ నుండి రేంజ్ రోవర్ వోగ్ వరకు అనేక కార్లు తన కలెక్షన్ గా భద్రపరచుకున్నాడు. అతని అన్ని కార్ల విలువ దాదాపు 6-7 కోట్లు ఉంటుంది.

రోలెక్స్ వాచ్

70 లక్షలు విలువ చేసే రోలెక్స్ వాచ్‌ను ఒక నవాబ్ సైఫ్ అలీ ఖాన్ కి బహుమతిగా ఇచ్చాడు . ఇది మామూలు రోలెక్ వాచ్ కాదండోయ్, బంగారం తో మెరుగులు చేసి, వజ్రాలతో అలంకరించిన లిమిటెడ్ ఎడిషన్ అట.

ఫార్చ్యూన్ హైట్స్

సైఫ్ ఇటీవల తన విలాసవంతమైన అపార్ట్‌మెంట్ నుండి బయటకు వెళ్లి పెద్ద విల్లాకు మారాడు. ఫార్చ్యూన్ హైట్స్ సుమారు 3-4 లక్షలకు అద్దెకు తీసుకోబడింది మరియు దీని విలువ 4.2 కోట్లు.

అతని కొత్త ఇల్లు

సైఫ్ కొత్త ఇల్లు విశాలమైన విల్లా మరియు దాని విలువ 6 కోట్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు