Bramayugam: పాన్ ఇండియా సినిమాతో వస్తున్న మమ్ముట్టి!

Bramayugam New movie:

మలయాళ స్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణ నటుడిగా పేరొందిన ఈయన ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోతారు. ఒక్క మళయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న మమ్ముట్టి రీసెంట్ గా చేసిన సినిమాలు అంతగా ప్రభావం చూపలేదు. ఈ ఇయర్ ఆయన నటించిన క్రిస్టోఫర్, ఏజెంట్ సినిమాలు ప్లాప్ అయ్యాయి. అందుకే స్క్రిప్ట్ ల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు.

ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు మమ్ముట్టి. మలయాళ దర్శకుడు రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా కొత్త సినిమా ఓపెనింగ్ ఈరోజే జరిగింది. ఆ సినిమా హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ,తెలుగు,తమిళ,కన్నడ తో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు.

“భ్రమయుగం” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక ఫిక్షనల్ హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమా కాన్సెప్ట్ తెలిసేలా బ్లాక్ అండ్ వైట్ లో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. భ్రమ యుగం సినిమాని “నైట్ షిఫ్ట్ స్టూడియోస్”, వై నాట్ స్టూడియోస్ బ్యానర్ లో చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ కలిసి నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలుకానుండగా, 2024 సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ లోపు 2023లో మమ్ముట్టి నటిస్తున్న ఇతర సినిమాలు కాథల్ ది కోర్, బజూకా సినిమాలు రిలీజ్ చేసేస్తారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు