Biggboss season7: ‘మాస్’ డైలాగ్ తో నాగ్ ని ఇంప్రెస్ చేసేసాడు?

స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ షో రసవత్తరంగా మారుతుంది. ఈ షో మొదలైనప్పటినుండి నాగార్జున చెప్పినట్టు అంతా ఉల్టా పల్టా గా జరుగుతుండగా, షో లో ఎవరికీ వారు తమ ఆటతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నారు. అయితే బిగ్ బాస్ షో లో ముందు నుండి ఎక్కువ ఇంప్రెస్ చేస్తుంది మాత్రం శివాజీ, యావర్, ప్రశాంత్, తేజ. లేటెస్ట్ గా అర్జున్ కూడా తనదైన శైలిలో బాగా ఆడుతున్నాడు.

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఎక్కువ మంది ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది ప్రిన్స్ యావర్. యాంగ్రీ మ్యాన్ గా తన ఆటని స్టార్ట్ చేయగా, ఫస్ట్ వీకే ఎలిమినేట్ అవ్వాల్సి ఉండగా, లక్కీ గా బయటపడి ఇక్కడి వరకు వచ్చాడు. ఇక వోటింగ్ రేస్ లో కూడా టాప్ లో నిలుస్తున్నాడు.

ఇక లేటెస్ట్ గా ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున ని కూడా తన తెలుగుతో ఇంప్రెస్ చేసేసాడు. ఈ ఎపిసోడ్ కి అనిల్ రావిపూడి, శ్రీ లీల గెస్ట్లుగా రాగా, ఆ టైం లో అనిల్ రావిపూడి యావర్ ని ఒక్కసారి తెలుగులో మాట్లాడమంటాడు. అప్పుడు యావర్ నాగార్జున మాస్ సినిమాలో ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి అందర్నీ ఇంప్రెస్ చేస్తాడు. ఆ డైలాగ్ విన్న నాగార్జున కూడా షాక్ అయ్యాడు.

- Advertisement -

ఇక ఈ వారంలో కెప్టెన్ కూడా అయిన యావర్ తన డ్యూటీ లో చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాడు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు