Biggboss season 7: ఆటను ఇప్పటికైనా అర్ధం చేసుకుంటారా..?

 

బిగ్ బాస్ సీజన్ 7 లో ఆరోవారం ఎలిమినేషన్ టైం కి దగ్గర పడగా, అందులో కొత్త కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారని తెలిసిందే. అయితే ఈ సారి కూడా ఫిమేలే ఎలిమినేట్ అవుతారని అందరూ గెస్ చేయగా, వాళ్లలో ఎక్కువ మంది అశ్విని శ్రీ ఎలిమినేట్ అవుతుందని ఊహించినా, బిగ్ బాస్ మాత్రం అనూహ్యంగా నైని పావని ని ఎలిమినేట్ చేయడం జరిగింది. అయితే ఈ ఎలిమినేషన్ ని భర్తీ చేస్తూ, బిగ్ బాస్ లో లాస్ట్ మూడు వారాల్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ముగ్గురిలో ఒకర్ని రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ హౌస్ మేట్స్ కి ఇచ్చాడు. వాళ్లలో ఎక్కువ శాతం శుభ శ్రీ కి వోట్ వేసే అవకాశం కనిపిస్తుంది.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో కొందరు ఆటగాళ్లు ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి తమ వే లోనే ఆడుతూ, కంటెస్టెంట్స్ చెప్పింది అర్ధం చేసుకోకుండా, తమ ప్రవర్తనతో మొండిగా ఉంటూ ఇబ్బంది పెడుతున్నారు. అయితే వాళ్ళకి కౌంటర్ వేస్తూ నాగార్జున టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్ లో ఒక కంటెస్టెంట్ గురించి ఒక మాట అంటూ, ఆ మాట పై హౌస్ మేట్స్ అభిప్రాయం తెలుసుకుంటాడు.

- Advertisement -

ఉదాహరణకి తేజ బిగ్ బాస్ లో కామెడీ చేస్తూ నెట్టుకొస్తున్నాడు, అంటే దానికి మెజారిటీ అఫ్ హౌస్ మేట్స్ “నో” అన్నారు. ఇక ఆ తర్వాత అశ్వనికి బిగ్ బాస్ గేమ్ అర్ధం కావడం లేదని అనగా, అక్కడ ఎక్కువ మంది నిజమని తేల్చేసారు.

ఇలా అందరి గురించి కొన్ని కొన్ని నిజాలు చెప్పి వాళ్ళని జాగ్రత్తగా గేమ్ ఆడమని చెప్పారు. ముఖ్యంగా అమర్, శోభ కి నాగార్జున స్పెషల్ గా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైనా వాళ్ళు అది అర్ధం చేసుకుంటే గేమ్ లో ముందుకెళతారు. లేదంటే ఆటని ఆడియన్స్ చేతిలో పెట్టినట్టే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు