Bigg Boss Leaks: ఈ వీక్ కూడా షాకింగ్ ఎలిమినేషన్..!

బిగ్ బాస్ సీజన్ 7 ఆడియెన్స్ అంచనాలకు అందకుండా జరుగుతోంది. ఉల్టా పల్టా పేరుతో గేమ్ లో చాలా చేంజెస్ చేయటంతో షో మునుపటికంటే ఆసక్తిగా మారింది. గేమ్ లో కొత్త రూల్స్ తో పాటు ఎలిమినేషన్ కూడా పకడ్బందీగా ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీమ్. ఈ సీజన్లో వరుసగా 5మంది ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వటం ఆసక్తిగా మారింది.

ఈ నేపథ్యంలో ఈ వీక్ ఎలిమినేషన్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వీక్ కొత్తగా ఎంటరైన కంటెస్టెంట్ నయని పావని ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంటరైన నయని యాక్టివ్ గా ఉంటూ నామినేషన్స్ లో తన వాయిస్ క్లియర్ గా వినిపిస్తూ ఉండటంతో పాజిటివిటి క్రియేట్ అయ్యింది.

నయని హౌస్ లోకి ఎంటరైన ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అవ్వటం ఆడియెన్స్ ని షాక్ కి గురి చేసింది. ఉల్టా పల్టా అన్న ట్యాగ్ లైన్ కి తగ్గట్టుగానే ఈ సీజన్లో ఊహించని విధంగా షో జరుగుతోంది.కొత్తగా ఎంటరైన కంటెస్టెంట్స్ లో ఈ అశ్విని కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్ గా కనిపిస్తుంటే, భోలే శావళి ఇరిటేటింగ్ గా ఉన్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఈ వీక్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేటి అవుతారని అనుకుంటే నయని ఎలిమినేట్ అవ్వటం షాకింగ్ గా మారింది.

- Advertisement -

వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రమే కాకుండా మూడు వారాల తర్వాత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కి రీఎంట్రీ ఛాన్స్ ఇవ్వటం సప్రైజింగ్ గా మారింది. శనివారం ఎపిసోడ్ లో ఓల్డ్ కంటెస్టెంట్స్ కి ఓటింగ్ రిక్వెస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ ఎవరు రీఎంట్రీ ఇస్తున్నారన్నది అనౌన్స్ చేయనున్నాడు. మరి, రతిక, శుభశ్రీ, దామినీలలో ఎవరు రీఎంట్రీ ఇస్తారన్నది చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు