Puri Jagannadh: డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం కాంప్రమైజ్ అవుతాడా.

Puri Jagannath: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ ఒకరు. చాలామంది హీరోలకి ఒక మాస్ ఇమేజ్ ను తీసుకొచ్చిన ఘనత పూరి జగన్నాథ్ కి ఉంటుంది అని చెప్పొచ్చు. బద్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూరి తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ను ఏర్పరుచుకున్నారు. పూరి జగన్నాథ్ సినిమా అంటే కేవలం క్యారెక్టరైజేషన్తో ఆడేస్తుంది అనేంతల క్యారెక్టర్ ను డిజైన్ చేస్తాడు పూరి. రీసెంట్ టైమ్స్ లో పూరి జగన్నాథ్ హిట్ చూసి చాలా రోజులైంది అని చెప్పాలి. ఎన్నో ఆశలతో చేసిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ కు గురైంది. ఆ డిజాస్టర్ సినిమా నుంచి పూరి జగన్నాథ్ ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాను చేస్తున్నాడు పూరి జగన్నాథ్.

డబల్ ఈస్మార్ట్ ఆశలన్నీ
ప్రస్తుతం పూరి జగన్నాథ్ చేస్తున్న ఈ డబల్ ఈ స్మార్ట్ సినిమా పైన ఆశలన్నీ ఉన్నాయి. ఈ సినిమా హిట్ అవ్వటం అనేది పూరి జగన్నాథ్ కి చాలా ఇంపార్టెంట్. అలానే రామ్ పోతినేని కు కూడా హిట్టు పడి చాలా రోజులైంది. ఈ సినిమా హిట్ అయితే వీరిద్దరూ మళ్లీ కం బ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇకపోతే ప్రతి దర్శకుడికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఉంటుంది అలా పూరి జగన్నాథ్ విషయానికి వస్తే, పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన. ఈ సినిమా గురించి ఎప్పటినుంచో కలలు కంటూ వస్తున్నాడు పూరి జగన్నాథ్.

Puri Jagannath: Will he compromise for a dream project?
Puri Jagannath: Will he compromise for a dream project?

సక్సెస్ ట్రాక్ లో లేకపోవడం వలన
ఇకపోతే లైగర్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలోనే ఈ ప్రాజెక్టును మొదలుపెట్టి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు పూరి. విజయ్ దేవరకొండ నటించిన ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. ఇకపోతే మహేష్ బాబు హీరోగా ఈ ప్రాజెక్టును చేయబోతున్నట్లు అప్పట్లో అనౌన్స్ చేశాడు పూరీ జగన్నాథ్. ఇకపోతే పూరీ జగన్నాథ్ ఇదివరకే మహేష్ బాబుతో చేసిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కానీ పూరి జగన్నాథ్ సక్సెస్ ట్రాక్ లో లేకపోవడం వలన ఈ సినిమా పట్టాలెక్కలేదు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడడానికి చాలామంది రెడీగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

డ్రీమ్ కోసం కాంప్రమైజ్
ఇకపోతే పూరి జగన్నా గత ఇంటర్వ్యూస్ లో చాలాసార్లు చెప్పుకొచ్చారు. తను ఎవరికోసం వెయిట్ చేయనని నువ్వు వస్తేనే నాకు ఈ సినిమా జరుగుద్ది అని అనుకొని టైపు నేను కాదని చెప్పాడు. అలా ఇప్పుడు జనగణమన ప్రాజెక్టు కోసం మరో హీరోతో చేతులు కలుపుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో హనుమాన్ సినిమాతో అద్భుతమైన హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు తేజసజ్జ. ఇప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించబోయే జనగణమన సినిమాలు తేజ హీరోగా కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. నిజంగానే తన డ్రీమ్ కోసం కాంప్రమైజ్ అయ్యి ఒక చిన్న హీరోతో పూరి జగన్నాథ్ వెళ్తాడా లేదా తెలియాలి అంటే దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు వేచి చూడక తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు