Raju Yadav Postpone : అంతా గెటప్ శ్రీను బ్యాడ్ లక్… మూవీ వాయిదా పడటానికి రీజన్ ఇదే

Raju Yadav Postpone.. గత దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులను అలరిస్తున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇప్పటికే చాలామంది కమెడియన్స్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో కొంతమంది టాప్ సెలబ్రిటీలుగా మారితే మరి కొంత మంది వెండితెరపై ఎంట్రీ ఇచ్చి హీరోలుగా చలామణి అవుతున్నారు.. అలాంటి వారిలో బుల్లితెర కమలహాసన్ గా గుర్తింపు తెచ్చుకున్న గెటప్ శ్రీను కూడా ఇప్పుడు సినిమాలలోకి వచ్చేశారు. ఒకవైపు టీవీ షోలు చేస్తూనే మరొకవైపు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా హీరోగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈయన హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా రాజు యాదవ్.. ఈ సినిమా తాజాగా విడుదల తేదీ వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..

రాజు యాదవ్ మూవీ వాయిదా..

Raju Yadav Postpone: Because of that reason Raju yadav movie postponed.!
Raju Yadav Postpone: Because of that reason Raju yadav movie postponed.!

సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కే .ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. మే 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.. దీంతో గెటప్ శ్రీను కూడా రోజులు లెక్కపెడుతూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు కూడా. కానీ ఇప్పుడు అనుకోకుండా ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుపుతూ.. ఒక పోస్ట్ షేర్ చేయడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.

గెటప్ శ్రీను బాడ్ లక్ అంటే ఇదే..

ఇకపోతే తాజాగా ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుండగా ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ గెటప్ శ్రీను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక పోస్టు షేర్ చేశాడు. ఈ సినిమాను కొత్త రిలీజ్ డేట్ తో మళ్ళీ వస్తాము.. డబుల్ ఎనర్జీతో త్వరలోనే.. కొత్త డేట్ వచ్చేస్తుంది అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక త్వరలోనే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టి కొత్త డేట్ ను కూడా అనౌన్స్ చేయబోతున్నాము అంటూ ప్రకటించారు. ఈ విషయం తెలిసి అభిమానులు అంతా గెటప్ శ్రీను బ్యాడ్ లక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు..

- Advertisement -

వాయిదాకు కారణం..

ఇకపోతే ఈ సినిమా ఇలా ఉన్నట్టుండి వాయిదా పడడానికి గల కారణం ఏమిటి అంటే.. తెలంగాణలో సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా 10 రోజుల పాటు క్లోజ్ కాబోతున్నాయి.. మరొకవైపు ఆంధ్రాలో పవన్ వర్సెస్ జగన్ పోరులో.. గెటప్ శ్రీను పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వడానికి ప్రచారానికి వెళ్లి అక్కడ జగన్మోహన్ రెడ్డి పై చేసిన కామెంట్లు వైసిపి అభిమానుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి..ఇలాంటి సమయంలో ఇప్పుడు రాజు యాదవ్ రిలీజ్ అయితే అన్ని విధాల సినిమా కలెక్షన్స్ కి నష్టం వాటిల్లుతుందని ఆలోచించిన చిత్ర బృందం ప్రస్తుతం సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు.. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తాము అన్న విషయాన్ని చెప్పలేదు..ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి సినిమా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా గెటప్ శ్రీను కి బ్యాడ్ టైం నడుస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు