Bigg Boss Season 7: అమర్ కి కాంప్లిమెంట్ ఇచ్చిన నాగార్జున..!

బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు ఆసక్తిగా మారుతోంది. ఈ సీజన్ గేమ్ లో చాలా చేంజెస్ చేసిన కారణంగా షో ఫస్ట్ వీక్ నుండే ఇంట్రస్టింగ్ గా మారింది. కంటెస్టెంట్స్ అందరూ యాక్టివ్ గా ఉండటమే కాకుండా ఫిజికల్ టాస్క్ లలో కూడా చురుగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అమర్ దీప్ మాత్రం స్టార్ మా బ్యాచ్ లో చేరి టాస్క్ లలో వీక్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు.

గత వారం నుండి యాక్టివ్ గా ఉంటున్న అమర్ తనని తానూ ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ గా అర్హత సాధించటం కోసం చాలా ట్రై చేసినప్పటికీ దక్కించుకోలేక పోయాడు. శనివారం ఎపిసోడ్ నాగార్జున హౌస్ మేట్స్ లో బ్రెయిన్ లెస్ ఎవరు, ఎయిమ్ లెస్ ఎవరు అన్నది డిసైడ్ చేయమని ఇచ్చిన ఫన్నీ టాస్క్ ఇంట్రస్టింగ్ గా మారింది.

ఈ టాస్క్ లో శివాజీ అమర్ అని బ్రెయిన్ లెస్ అని డిసైడ్ చేయగా నాగార్జున ఈ మధ్య అమర్ ఇంప్రూవ్ అయ్యాడని, తన ప్లస్ పాయింట్స్ ఏంటో తాను తెలుసుకోలేక పోతున్నాడని అన్నాడు. ఇక నుండి గేమ్ లో వంద శాతం ఎఫర్ట్స్ పెట్టాలని  దీంతో నాగార్జున అమర్ దీప్ కి సపోర్ట్ చేస్తున్నాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నాడు.

- Advertisement -

ఈ సీజన్లో వరుసగా లేడి కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన నేపథ్యంలో ఈ వీక్ ఎవరు ఎలిమినేటి అవుతారన్నది ఆసక్తిగా మారింది. అయితే, నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఓటింగ్ పరంగా కొత్త కంటెస్టెంట్ నయని పవని బాటంలో ఉందని, ఈ వారం తనే ఎలిమినేట్ అవుతుందని సమాచారం అందుతోంది. ఇదే గనక నిజమైతే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన 6వ ఫీమేల్ కంటెస్టెంట్ అవుతుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు